నిజమైన లగడపాటి అంచనా: అసెంబ్లీ కూడానా

హైదరాబాద్: మున్పిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాలపై మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. దీంతో శానససభ, లోకసభ ఎన్నికల ఫలితాల విషయంలో ఆయన అంచనాలు నిజం అవుతాయా అనే ఆసక్తి నెలకొని ఉంది. మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల ముగిసిన తర్వాత ఆయన తన అంచనాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

తెలంగాణలో కాంగ్రెసు, సీమాంధ్రలో తెలుగుదేశం అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని ఆయన మున్పిపల్, నగర పాలక సంస్థల విషయంలో చెప్పారు. సీమాంధ్రలో 60కి పైగా మున్పిపాలిటీలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే 62 మున్పిపాలిటీల్లో టిడిపి విజయం సాధించింది.

Lagadapati estimation prooved right

మంగళవారంనాటి ఎంపిటీసి, జడ్పిటీసి ఎన్నికల్లోనూ ఫలితాల సరళి ఇదే విధంగా ఉండవచ్చునని ఆయన అంచనా వేశారు. సీమాంధ్రలోని కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ టిడిపి ఆధిక్యం కనబరుస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ నెల 16వ తేదీన వెలువడి శాసనసభ, లోకసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా ఆయన అంచనాలు వేశారు.

సీమాంధ్రలో బిజెపి - తెలుగుదేశం కూటమి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని ఆయన అంచనా వేశారు. మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల విషయంలో లగడపాటి అంచనాలు నిజం కావడంతో శాసనసభ, లోకసభ ఎన్నికల ఫలితాల విషయంలో కూడా అంచనాలు నిజమవుతాయా ఉత్కంఠ ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+