చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ - తేల్చేసిన కోటంరెడ్డి..!!

ఎమ్మెల్యే కోటంరెడ్డి తన మనసులో మాట బయట పెట్టారు.చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తన మనసులో మాట బయట పెట్టారు. వైసీపీ నాయకత్వం..ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన కోటంరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. కోటంరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిసారని..అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకే వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోటంరెడ్డి చేసిన పోన్ ట్యాపింగ్ ఆరోపణలు వాస్తవం కాదని.. చంద్రబాబు ఎమ్మెల్యే కోటంరెడ్డిని ట్యాపింగ్ చేసారని మంత్రి కోటంరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కోటంరెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలనేది తన ఆకాంక్షగా వెల్లడించారు. చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని కోటంరెడ్డి తేల్చి చెప్పారు.

టీడీపీ నుంచి పోటీ - చంద్రబాబు నిర్ణయమే

టీడీపీ నుంచి పోటీ - చంద్రబాబు నిర్ణయమే

ఎమ్మెల్యే కోటంరెడ్డి గత నెలలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారనేది వైసీపీ నేతల ఆరోపణ. తన ఫోన్ ట్యాపింగ్ చేసి..తనను అవమానించిన తరువాత తాను ఎవరిని కలిసినా అనవసరం అంటూ ఎక్కడా చంద్రబాబును కలిసారనే అంశాన్ని కోటంరెడ్డి ఖండించ లేదు. కాగా, చంద్రబాబు మార్గదర్శనంలోనే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేయనని కోటంరెడ్డి చెబుతూ వచ్చారు. టీడీపీలో చేరుతారనే ప్రచారం నడుమ..ఇప్పడు కోటంరెడ్డి తన మసులో మాటను బయట పెట్టారు. తన కోరిక ఏంటో చెప్పుకొచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలనేది తన ఆకాంక్షగా స్పష్టం చేసారు. అదే సమయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటూ వ్యాఖ్యానించారు.
రాజీనామా పై కొత్త మెలిక

రాజీనామా పై కొత్త మెలిక


ఇద సమయంలో తనను రాజీనామా చేయమంటున్న వైసీపీ నేతల డిమాండ్ పై కోటంరెడ్డి కొత్త మెలిక పెట్టారు. టీడీపీ గుర్తు మీద గెలిచి వైసీపీలో చేరిన వారి దగ్గర స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయించాలని డిమాండ్ చేసారు. అప్పుడు తన రాజీనామా గురించి తాను స్పందిస్తానంటూ చెప్పుకొచ్చారు. మెజారిటీ కార్పొరేటర్లు, సర్పంచులు తనతో లేరని కోటంరెడ్డి అంగీకరించారు. తాను ఎవరి ట్రాప్ లో పడనని స్పష్టం చేసారు. ఒక్క ఎమ్మెల్యే కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్రాప్ వేయాల్సిన అవసరం లేదన్నారు. తనతో ఉన్న నేతలను తాను కాపాడుకుంటానని ధీమా వ్యక్తం చేసారు. కార్పొరేషన్లో ఎప్పుడు సమావేశాలు జరిగినా... పిలిచినా, పిలవకపోయినా తాను, మేయర్ వెళ్తామని కోటంరెడ్డి స్పష్టం చేసారు.

జూన్ తరువాత గడపగపడకు

జూన్ తరువాత గడపగపడకు


జూన్ మాసం తరువాత తాను ప్రతీ గడపకు వెళ్తానని కోటంరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి వర్సస్ ఆదాల పోరు తీవ్ర స్థాయికి చేరింది. కోటంరెడ్డి మద్దతు దారులుగా వైసీపీ నుంచి ఎవరూ వెళ్లకుండా ఆదాల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి కాకానితో కలిసి పార్టీ కేడర్ అంతా కలిసి కట్టుగా ఉండేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మండలాల వారీగా సమీక్షలు చేస్తున్న ఆదాల..త్వరలోనే నియోకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గం లో చేపట్టాల్సిన కార్యక్రమాల పైన సమీక్షలు చేస్తున్నారు. ఇక..ఆరు నెలల తరువాత చిత్ర విచిత్రాలు చూస్తారంటూ కోటంరెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. దీంతో..ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు రూరల్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+