చంద్రబాబు ట్రాప్ సక్సెస్ - వైసీపీ బోల్తా కొట్టింది అక్కడే..!!

టీడీపీ అధినేత వ్యూహం సక్సెస్ అయింది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీకి ఏం కావాలో అదే చేస్తున్నారు. ఎలా జోష్ తేవాలో అందులో సక్సెస్ అవుతున్నారు. బలం లేదని ప్రచారం సాగుతున్న వేళ అనూహ్యంగా పట్టభద్రుల ఎన్నికల్లో చివర్లో తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని అందించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అతి విశ్వాసం ఆ పార్టీని దెబ్బ తీసింది. అధికార పార్టీలోని అసమ్మతిని చంద్రబాబు అస్త్రంగా మలచుకున్నారు. ఎంపిక చేసిన వారిని పక్కా ట్రాప్ చేసారు. వారితో తమ అభ్యర్ధిని గెలిపించుకున్నారు. అధికార పార్టీకి షాక్ ఇచ్చారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మరోసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అధికార వైసీపీలోని ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. పట్టభద్రుల నియోజకవర్గంలో చివరి నిమిషంలో పీడీఎఫ్ తో పొత్తు ద్వారా మూడు స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించింది. కేడర్ లో కొత్త జోష్ కు కారణమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడు సీట్లు తమకే దక్కుతాయనే నమ్మకంతో బరిలో దిగింది. చంద్రబాబు తమ అభ్యర్దిని బరిలో దించాలని చివర్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ వ్యూహాలను పూర్తిగా అంచనా వేయలేకపోయింది. నెల్లూరు జిల్లా వైసీపీలో కొనసాగుతున్న పరిణామాలను చంద్రబాబు పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకున్నారు.

MLA Quota MLC elections: How did YSRCP lost its hold,Reason behind Chandrababu success

ముందుగా తమతో కలిసేందుకు సిద్దంగా ఉన్న వారి పైన నమ్మకం కలిగాకనే..చంద్రబాబు తమ అభ్యర్ధిని ఖరారు చేసారు. బరిలోకి దించారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్ లోకి వెళ్లిన తరువాత మరరో సీనియర్ కూడా వారి బాటలోనే ఉన్నారనే ప్రచారం సాగింది. కానీ, వైసీపీ జిల్లా బాధ్యులు సీరియస్ గా తీసుకోలేదు. ఇక.. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల స్థానంలో కొత్తగా సమన్వయ కర్తలకు బాధ్యతలు అప్పగించింది. ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కవనే సంకేతాలు వెలువడ్డాయి. వారంతా లోలోపల అసంతృప్తితో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ, వారు గీత దాటకుండా చేయటంలో పార్టీ నాయకత్వం విఫలమైంది. వీరిని చంద్రబాబు తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేసారు.

ఇక..ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలను టీడీపీ టీం ట్రాప్ చేస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం చేిసంది. అసంతృప్తితో ఉన్న కొందరి ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడారు. వారిలో కొందరి డిమాండ్లకు ఓకే చెప్పారు. ఇదే సమయంలో చంద్రబాబు టీం తమతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీలో ముఖ్య నేతలకు కూడా ఎక్కడా సమాచారం లీక్ కాకుండా వ్యవహరించారు. 16 మంది టచ్ లో ఉన్నారనే ప్రచారంతో తమతో నిజంగా సహకరించే వారి పైన ఫోకస్ లేకుండా వైసీపీ నాయకత్వాన్ని డైవర్ట్ చేసారు. ఇక, టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా వెళ్లారు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి నలుగురు మద్దతుగా నిలిచారు. అయితే, ఎన్నికల వేళ..వైసీపీపైన చంద్రబాబు పై చేయి సాధిస్తున్నారనే నైతిక బలం పెంచటంలో సక్సెస్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+