గోల్డ్‌మన్ బంగారు చొక్కా మిస్టరీ: ఏమైంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

పుణె: పూణే గోల్డ్‌మన్ దత్తాత్రేయ ఫుగే బంగారం చొక్కాపై ఇప్పుడు చర్చ సాగుతోంది. దాని చుట్టూ మిస్టరీ చోటు చేసుకుదంి. ఆయన హత్య తీవ్ర సంచలనం కలిగించి, దుమారం రేపుతున్న సమయంలో ఆయన ధరించిన కోటిన్నర రూపాయల విలువ చేసే బంగారం చొక్కా ఏమైందనేది చర్చనీయాంశంగా మారింది.

ఫుగే అంత్యక్రియలకు ముందు ఫుగే ఇల్లు బంధవులు, సన్నిహితులతో నిండిపోయింది. ఫుగే భార్య సీమా విషాదం చెప్పనలవి కాకుండా ఉంది. అయితే, ఫుగే బంగారు చొక్కా ఏమైందనేది అక్కడున్న అందరికీ సందేహం కలిగింది. అయితే, అది ఎవరినీ అడిగే సందర్భం కాదు. కానీ గుసగుసలు మాత్రం నడిచాయి.

బంగారం పోత పోసి, క్రిస్టల్ బటన్లు, మ్యాచింగ్ రింగ్స్‌, బ్రాస్‌లెట్లతో మెరిసిపోయిన చొక్కానే .ఫుగేకు 'గోల్డ్‌మన్' గుర్తింపు తెచ్చింది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలోనూ ఫుగే పేరు ప్రచారంలోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఫుగే దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే.

Also Read: గోల్డ్‌మన్‌ను చంపింది కొడుకు మిత్రులే: పక్కా ప్లాన్

Mystery on Goldman Dattratreya's gold shirt

ఆ చొక్కా చించ్వాడ్‌లోని రాన్కా జ్యూయెలర్స్‌ వద్ద ఉందని ఫుగే తనయుడు, హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన శుభమ్ చెబుతున్నట్లు సమాచారం. రాన్కా జ్యూయెలర్స్‌కు ఆ చొక్కాను ఎందుకు అప్పగించారనే కారణాన్ని మాత్రం శుభమ్ చెప్పడం లేదని అంటుననారు. అయితే రాన్కా జ్యూయెలర్స్‌ యజమాని తేజ్‌పాల్ రాన్కా మాత్రం ఈ విషయాన్ని ఖండించారు.

ఆ చొక్కాను తాము ఎందుకు దగ్గర ఉంచుకుంటామని అంటున్నారు. ఫుగే నుంచి ఆర్డర్ రావడంతో మూడునాలుగేళ్ల క్రితం ఆ చొక్కా తయారుచేశామని, అది పూర్తి కాగానే ఆయనకు ఇచ్చేశామని అన్నారు. తాము వస్తువులను కుదవ పెట్టుకునే వ్యాపారం చేయడం లేదని, తమది కేవలం అమ్మకాలు, కొనుగోళ్ల బిజినెస్ మాత్రమేనని అంటున్నారు.

అదే విషయంపై శుభమ్ చొక్కా వివరాలు తమ కుటుంబసభ్యులను అడిగి చెబుతానని అన్నాడు. రెండేళ్ల క్రితం ఆ చొక్కా వేసుకున్నాడని, ఇంచుమించు అప్పుడే తన తండ్రికి గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకోవాల్సి వచ్చిందని అతను చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

మనీలెండర్ కూడా అయిన ఫుగేకు చిట్‌ఫండ్ వ్యాపారం కూడా ఉందని, అయితే ఆయన అప్పుల్లో కూరుకుపోయి ఇన్వెస్టర్లకు లక్షల్లో బాకీ పడ్డాడని కూడా అంటున్నారు. అప్పుల కారణంగా అమ్మేసి ఉండవచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. ఇటీవలి కాలంలో ఆయన దాన్ని ధరించినట్లు తాము చూడలేదని కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు.

అయితే, ర్ణవ్యాపారి రాన్కా మరో వాదన కూడా వినిపిస్తున్నారు. ఆ చొక్కాను చెడగొట్టించి ఉండొచ్చని, ఆ పని చేయడం చాలా సులభమని తెలిపారు. ఫుగే ఆర్థిక సంక్షోంలో కూరుకుపోయి ఉండొచ్చని, షర్ట్ తయారు చేసిన తర్వాత రెండుసార్లు వేరే వస్తువులు కొనేందుకు వచ్చిన ఫుగే తమకు చెక్‌లు ఇచ్చాడని, అవి బౌన్స్ కావడంతో ఆయనపై కేసులు కూడా పెట్టామని రాన్కా అన్నాడు. అప్పట్నించి ఫుగేను దూరం పెట్టినట్లు తెలిపారు. అయితే, ఆ బంగారం చొక్కాపై మిస్టరీ మాత్రం వీడలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Debate is going on Pune goldman Dattatreya Phuge's gold shirt in the inner circles.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి