Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవితో నాగార్జున షో ధనాధన్ ముగింపు

హైదరాబాద్: తెలుగు టెలివిజన్ చరిత్రలో ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ షో ఈ నెల 7వ తేదీ గురువారంనాడు ముగుస్తోంది. ఈ ముగింపు షోలో నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారు. ఈ 40వ ఎపిసోడ్‌కు చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నారు.

ఈ ఇరువురు హీరోలు బుల్లితెరపై కనిపించే అరుదైన సందర్బాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు కల్పిస్తోంది. మీలో ఎవరు కోటీశ్వరుడు 40వ ఎపిసోడ్ ప్రేక్షకులకు దాన్ని అనుభూతిలలోకి తెస్తోంది. జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్స్ (జిఇసి)లో నెంబర్ వన్ చానెల్ మా టావీలో ఆగస్టు 7వ తేదీ రాత్రి 9 గంటలకు ఎపిసోడ్ ప్రారంభమవుతుంది.

Nagarjuna's Meelo Evaru Koteeswarudu to conclude

మీలో ఎవరు కోటీశ్వరుడు సెకెండ్ సీజన్ త్వరలోనే ప్రారంభమవుతుందని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని తెలుగువారిలో వయసుతో సంబంధం లేకుండా సాంఘిక ఆర్థిక పరిస్థితులకు అతీతంగా ప్రతి ఒక్కరికీ దగ్గరైంది.

మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ దృక్పథంతో మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో రూపుదిద్దుకుంది. ఇలాంటి షో ద్వారా సామాజికంగా మార్పు తీసుకురావాలనేది ఆయన కోరి. ఈ షో చాలా అర్థవంతంగా, ప్రయోజనాత్మంగా సాగింది. రకరకాల ఫార్మాట్లను అధ్యయనం చేసిన తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో జీవితాలను మార్చి వేసే అవకాశం ఉందని ఈ షోను ఆమోదించారు.

షో ప్రారంభానికి ముందుగా అనుకున్నట్లుగానే హృదయాన్ని కలచివేసే ఎన్నో జీవిత కథలు వెలుగులోకి వచ్చాయి. ఈ షో సామాన్యుడిలో స్ఫూర్తిని నింపే సాధనంగా నిలిచింది. నాగార్జున ఈ షోను నడిపిన తీరు కూడా విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 11 లక్షల మంది ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు. జూన్ 9వ తేదీన మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో ప్రారంభమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+