కొచ్చర్, రజనీకి సల్మాన్ సవాల్: మెచ్చుకున్న మోడీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం సల్మాన్ చీపురు పట్టారు. కర్జత్ ప్రాంతంలో శుభ్రం చేసిన అనంతరం ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తాను స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నానని, తాను రజనీ కాంత్, అమీర్ ఖాన్‌లను నామినేట్ చేస్తున్నట్లు కూడా కింద పేర్కొన్నారు.

సల్మాన్ ఖాన్ తొమ్మిది మందిని నామినేట్ చేశారు. అమీర్ ఖాన్, అజిమ్ ప్రేమ్ జీ, చందా కొచ్చార్, ఒమర్ అబ్దుల్లా, ప్రదీప్ దూత్, రజత్ శర్మ, రజనీకాంత్, వినీత్ జైన్‌లను నామినేట్ చేశారు. అలాగే, తనను నామినేట్ చేసినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అన్నారు.

మోడీ ప్రశంసలు

Narendra Modi appreciates Salman Khan's Swachh Bharat task

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టి ఊడ్చిన సల్మాన్ ఖాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. సల్మాన్ ప్రయత్నం ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే దిశగా మరికొందరికి స్ఫూర్తినిస్తుందని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

సల్మాన్ సోదరి పెళ్లికి మోడీ?

ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ పెళ్లికి హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఈ ఏడాది మే 26వ తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవానికి నరేంద్ర మోడీ సల్లూను, అతని తండ్రి సలీమ్ ఖాన్‌ను ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇప్పుడు తన సోదరి అర్పితా ఖాన్ పెళ్లికి నరేంద్ర మోడీని పిలువనున్నారని అంటున్నారు. అర్పితా ఖాన్ పెళ్లి నవంబర్ 16వ తేదీన జరగనుంది.

ఈ విషయమై సలీం ఖాన్ మాట్లాడుతూ.. తాము ప్రధాని నరేంద్ర మోడీని పెళ్లికి ఆహ్వానిస్తున్నామని, తమ విజ్ఞప్తి మేరకు ఆయన సమయం చూసుకొని వస్తారని భావిస్తున్నామని చెప్పారు. ఈ ఫెళ్లిని చాలా పెద్ద ఎత్తున జరపాలని తాను కోరుకోవడం లేదన్నారు. పెళ్లిని సాదాసీదాగా జరపాలని తన పిల్లలకు సూచించానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+