హైద్రాబాద్‌పై ఐసిస్ ప్రమాదకర కుట్ర: గంటల్లో బాంబులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని పాతబస్తీలో అరెస్టైన ఐసిస్ సానుభూతిపరుల నుంచి ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) షాకింగ్ విషయాలను రాబట్టింది. భారత్‌ను ఖలీఫా రాజ్యంగా చేయాలనే లక్ష్యంతో వారు పని చేస్తున్నారని తమ విచారణలో వెల్లడయిందని ఎన్ఐఏ తెలిపింది.

భారత దేశంలో ఒక్కో దాడికి ఒక్కో పేరును కొత్తగా సృష్టించాలని ఐసిస్.. ఇక్కడి సానుభూతిపరులకు సూచించారు. ఇందులో భాగంగా హైదరాబాదులో పేలుళ్లకు జునూద్ ఉల్ ఖలీఫా ఫిల్ హింద్ పేరును తమ తీవ్రవాద కార్యకలాపాలకు పెట్టుకున్నట్లుగా గుర్తించారు. దీని ద్వారా రిక్రూట్మెంట్ కూడా నెరపాలనుకున్నారు.

షాకిచ్చే కొత్త కోణం: మావోలతో ఐసిస్ ఉగ్రవాదులకు లింక్
నిందితులు భారత్ ఐసిస్ చీఫ్ యూసుఫ్ అల్ హిందీ అలియాస్ షఫీ అర్మార్‌తో పలుమార్లు సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరిపారని గుర్తించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ట్రిలియన్స్, స్కైప్, స్యూర్‌స్పాట్, చాడట్ సెక్యూరిటీ, నింబుస్ తదితరాల ద్వారా మాట్లాడారు.

NIA probe: ISIS men wanted a caliphate in India

విధ్వంసం సృష్టించి భారీగా ప్రాణనష్టం కలిగించాలనే ఆలోచన రావడం, ఐసిస్‌ అగ్రనేతలను సంప్రదించడం, ఉగ్రవాద సంస్థ స్థాపించడం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకోవడం, ఆయుధాలను ఉపయోగించడంలో తర్ఫీదు తీసుకోవడం, ప్రమాదకరమైన టైం బాంబులు తయారీ దశకు చేరుకోవడం, ఇదంతా కేవలం 4 నెలల వ్యవధిలో పూర్తి చేసినట్లు గుర్తించారు.

మన బలగాలు అప్రమత్తంగా లేకుంటే ఈ పాటికే హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడి ఉండేవారని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో వెలుగుచూసిన కుట్ర పూర్తిగా భిన్నమైనదని, అత్యంత ప్రమాదకరమైందని అభిప్రాయపడుతున్నారు. విచారణలో వెల్లడైన అంశాలను కోర్టుకు తెలపనున్నారు.

బాంబులు ఎక్కడ పేల్చాలనుకున్నారో గుర్తించాం: ఐసిస్‌పై ఎన్ఐఏ
ఎన్ఐఏ గత నెల 30న తొలుత ఐదుగురు యువకులను, ఈ నెల 12న మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. రంజాన్‌ మాసంలోపు ఎట్టిపరిస్థితుల్లోనూ తాము అనుకున్నది సాధించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.

అధికారులు గుర్తించకుంటే పెను ప్రమాదం జరిగేది. బాంబు దాడులు జరిగాక, వీరంతా సిరియాకు వెళ్లిపోయేవారని అధికారులు గుర్తించారు. నిందితులు కేవలం నాలుగు నెలల్లోనే బాంబులు తయారు చేయడంలో ఆరితేరారని, 24 గంటల్లో పదుల సంఖ్యలో బాంబులు తయారు చేసేవారని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The NIA added in the chargesheet: “During the course of investigation it was found that the accused persons formed an organisation by name of Junood-ul-Khilafa-Fil-Hind (a group seeking to establish a caliphate in India with allegiance to ISIS/ISIL) to recruit Muslim youths to work for ISIS.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి