అమెరికా చదువులు ఇక కలే?: తాజా పరిణామాలతో భారీగా తగ్గిన వీసా దరఖాస్తులు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ వలసల వల్లే తమ దేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదని భావించిన ట్రంప్.. వలస విధానాలను మరుస్తూ.. విదేశీయులను భారీ స్థాయిలో తమ దేశానికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో విదేశీయులపై అమెరికాలో జాత్యహంకార దాడులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కారణాల వల్ల అమెరికా వెళ్లేందుకు భారత్ తోపాటు ఇతర దేశాల విద్యార్థులు కూడా ఆసక్తికనబర్చడ లేదు.

ఉన్నత చదువులకు అమెరికా వెళ్లాలని కలలు కంటున్న లక్షలాది మంది భారత విద్యార్థులకు అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇక భారత విద్యార్థులకు అమెరికా చదువు ఒక కలగానే మిగిలేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉద్యోగం కూడా కష్టసాధ్యంగానే మారుతోంది.

No more US university dreams? Applications from Indian students see drop

కాగా, అమెరికా చదువుకు వచ్చే దరఖాస్తులు భారీగా తగ్గినట్లు తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. 250కి పైగా అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలలపై అధ్యయనం నిర్వహించగా 'ఫాల్‌' కాలంలో అండర్‌గ్రాడ్యుయేట్‌ దరఖాస్తుల్లో 26 శాతం తగ్గుదల, గ్రాడ్యుయేషన్‌ దరఖాస్తుల్లో 15శాతం తగ్గుదల నమోదయినట్లు తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన 'ఓపెన్‌ డోర్స్‌ 2016' పూర్తి స్థాయి నివేదిక ఈ వారం చివరిలో విడుదల కావచ్చు.

ఆరు అగ్ర ఉన్నత విద్యా సంఘాలు ఈ అధ్యయనం నిర్వహించడం గమనార్హం. అంతర్జాతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తుల్లో సగటున 40శాతం తగ్గుదల నమోదైంది.
ప్రస్తుతం అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌, చైనా విద్యార్థులు 47శాతం మంది ఉన్నారు. దాదాపు 5లక్షల మంది ఈ రెండు దేశాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు.

అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులకు చైనా నుంచి వచ్చే దరఖాస్తులు 25శాతం పడిపోయాయి. గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఈ దేశం నుంచి వచ్చే దరఖాస్తులు 32శాతం తగ్గాయి. చైనా, భారత్‌, నేపాల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో విద్యార్థి వీసాలను తిరస్కరించడం పెరిగిందన్న భావన, అమెరికాలో ప్రస్తుత వాతావరణం ఇతర దేశాల వారు రావడానికి తగిన విధంగా లేదన్న భావన ఆయా దేశాల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉంది.

అంతేగాక, వీసాలకు సంబంధించి నియంత్రణలు, ప్రయోజనాల విషయంలో మార్పులు జరగవచ్చన్న ఆందోళనా వారిలో ఉంది. ఆయా దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించడం, అక్కడి నుంచి స్వదేశాలకు వెళ్లిన వారు తిరిగి అమెరికాకు వెళ్లడానికి సంబంధించి ఆంక్షలు విధించవచ్చన్న ఆందోళన నెలకొని ఉంది. ఈ క్రమంలోనే భారీగా వీసా దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A large number of US colleges are reporting a decline in applications for admission from international students, including from India and China, because of concerns and anxieties about the Donald Trump administration’s travel orders and a growing perception that the United States has become less welcoming of foreigners, according to a new survey.
Please Wait while comments are loading...