ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ తుమ్మలXనామా: 'టిడిపి'ని రాజేసిన రేవంత్ రెడ్డి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు టిడిపి నుంచి గెలిస్తే ముగ్గురే మిగిలారు. తెలంగాణను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా వదిలేసినట్లుగా చాలామంది భావిస్తున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్, బిజెపిలు అధికార టిఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర రావు, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి హేమాహేమీలు కారు ఎక్కారు.

ఇప్పుడు తెలంగాణ టిడిపిలో యువనేత రేవంత్ రెడ్డిదే హవా. దీంతో, తెలంగాణలో టిడిపి పరిస్థితి కాంగ్రెస్, బిజెపిల కంటే దారుణంగా ఉందనే భావన అంది. ఇటీవల ఉప ఎన్నికల్లోను కాంగ్రెస్ కంటే టిడిపి చాలా తక్కువ ఓట్లు దక్కించుకుంటోంది. తెలంగాణలో టిడిపిని అధికార టిఆర్ఎస్ పార్టీ ఓ విధంగా పట్టించుకోవడం మానేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ మరోసారి తెలంగాణలో చర్చనీయాంశమైంది. పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో టిడిపి చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికల్లో నామా నాగేశ్వర రావును బరిలోకి దింపేందుకు టిడిపి ప్రయత్నిస్తుంది. దీంతో టిడిపి వేడి రాజేసిందని చెప్పవచ్చు.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేయనున్నారు. ఆయన పైన టిడిపి తరఫున నామా నాగేశ్వర రావును బరిలోకి దింపేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు నామా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

నామాను ఒప్పించేందుకు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉందని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ బలం, ఆర్థిక బలం ఉన్న నామాను బరిలోకి దించాలని చూస్తున్నారు.

పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

గత ఏడాది వరకు నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావులు ఒకే పార్టీలో.. టిడిపిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన టిఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. అప్పటి వరకు తుమ్మల, నామాలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. జిల్లాలో వారి మధ్య ఆధిపత్య పోరు ఉండేది.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

తెలంగాణ పీఏసీ చైర్మన్, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి హఠాన్మరణంతో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. టిఆర్ఎస్ తరఫున తుమ్మల పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున నామా బరిలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో ఎన్నిక ఆసక్తికరంగా మారనుందని అంటున్నారు.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

ఖమ్మం జిల్లాలో ఆదిలో కమ్యూనిస్టులకు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. ఇటీవలే నేతలు తెరాసలోకి వస్తున్నందున.. ఇప్పుడు పార్టీ క్రమంగా పట్టు సాధిస్తోంది. ఖమ్మంను తమకు పెట్టని కోటగా మార్చుకునే క్రమంలోనే టిఆర్ఎస్.. ఇప్పటికే ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉన్న తుమ్మలను పాలేరు బరిలోకి దింపిందని అంటున్నారు.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

అయితే తనకు మంచి పట్టున్న ఖమ్మం జిల్లాలో సత్తా చాటేందుకు తెలంగాణ టీడీపీ కూడా కాస్తంత ఆలస్యంగా అయినా, సర్వశక్తులు ఒడ్డేందుకు కార్యరంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఖమ్మం మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త నామాను బరిలోకి దించే దిశగా అడుగులు వేస్తోంది.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

గతంలో తుమ్మల, నామాలు ఇద్దరూ టిడిపిలోనే ఉన్నారు. తుమ్మల ఎమ్మెల్యేగా ఉండగా, నామా ఎంపీగా ఉన్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. అయితే జనంలో మంచి పట్టున్న తుమ్మల ఓటమికి నామా తెర వెనుక యత్నాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికలు కావడంతో ఖమ్మం పార్లమెంటు నుంచి బరిలోకి దిగిన నామా.. వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేతిలో ఓడిపోయారు. నాటి ఓటమితో నామా రాజకీయాలకు ఒకింత దూరంగానే ఉన్నారు. తుమ్మల తెరాసలో చేరి మంత్రి అయి, యాక్టివ్‌గా మారారు.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

తెలంగాణలో టిడిపి కనుమరుగవుతుందనే వాదన, నామా చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో.. ఆయన రాజకీయాలకు దూరమేనని చాలామంది భావించారు. అయితే, పాలేరులు తుమ్మల పైన పోటీ అంటూ టిడిపి నామా పేరు తెరపైకి తీసుకు రావడం చర్చనీయాంశమైంది.

 పాలేరు ఉప ఎన్నిక

పాలేరు ఉప ఎన్నిక

నామా 2004లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు. 2009లో గెలుపొందారు. నామా నాగేశ్వర రావు టిడిపిలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

English summary
Now, again Nama versus Tummala in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X