భారత్‌పై పాక్ కుట్ర: ఉగ్రవాదులకు ‘బ్యాట్’తో శిక్షణ
పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ మరో సరికొత్త కుట్రకు తెరతీస్తున్నాయి. అంతంత మాత్రం శిక్షణతో భారత్‌కు పంపించే ఉగ్రవాదుల ఆటలు సాగటంలేదని ఐఎస్‌ఐ మరో భారీ కుట్ర పన్నింది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ మరో సరికొత్త కుట్రకు తెరతీస్తున్నాయి. అంతంత మాత్రం శిక్షణతో భారత్‌కు పంపించే ఉగ్రవాదుల ఆటలు సాగటంలేదని ఐఎస్‌ఐ మరో భారీ కుట్ర పన్నింది. పాకిస్థాన్ సైన్యంలో సుశిక్షితులైన బ్యాట్ దళాల (బోర్డర్ యాక్షన్ టీం)తో వాస్తవాధీన రేఖ వెంట భారత సైన్యంపై దాడులు చేయించేందుకు కుట్ర పన్నింది.
కాగా, ఈ విషయాన్ని భారత నిఘాసంస్థలు పసిగట్టాయి. ఈ కుట్రను అమలు చేయడానికి ఈ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లు జిహాదీ బృందాలతో కలిసి గుర్జ్, కెరాన్, నౌవ్‌గామ్, ఉరి, కాశ్మీర్‌లోయల్లో దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలను భారత్ సేకరించింది.

ఈ దాడులకు వేదికగా జాతీయ రహదారులను ఎంచుకున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. అనంతనాగ్, పుల్వామా, కుల్గామ్, కుప్వార, బారాముల్లా, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో దాడులు జరుగుతాయని అంచనా వేస్తోంది.
సోమవారం క్వాజీగుండ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ దళాలపై జరిగిన దాడి సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల భారత సైన్యం కాశ్మీర్‌లోయలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 140 మంది లష్కరే, హిజ్బుల్ ఉగ్రవాదులను హతమార్చింది.












Click it and Unblock the Notifications