బస్సు ప్రమాదం: తేలని ప్రయాణికుల లెక్క (ఫొటోలు)

హైదరాబాద్: బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సులో అసలు ఎంత మంది ప్రయాణిస్తున్నారనేది లెక్క తేలడం లేదు. బస్లులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నట్టు బస్సు యాజమాన్యం చెబుతోంది. అయితే మార్గ మధ్యంలో బస్సులో ఎక్కిన ప్రయాణికులు కనీసం మరో పది మంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయం అలా ఉంటే హైదరాబాదులోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద ప్రయాణికుల బంధువులు ఆందోళనకు దిగారు.

బస్సులో యాభై మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, ఆ లెక్కలు ఎవరి దగ్గర కూడా లేకపోవపడం విచిత్రంగా ఉంది. బస్సులో ఎక్కిన ప్రతి ప్రయాణికుని దగ్గరనుంచి వోల్వో బస్సుల్లో ముందుగా వారి పేరు, మొబైల్ నంబరూ రాసుకుంటారు. ఆ వివరాలు ఇంతవరకు బయటకు రాలేదు.
ప్రమాదం సంభవించిన బస్సులో కేవలం పది మంది మృతులకు సంబంధించిన వివరాలు మాత్రమే లభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహబూబ్ నగర్ పోలీసులు 29 మంది పేర్లు ఇవ్వగలిగారు. కాగా హైదరాబాద్‌లో మొత్తం 33 మందికి సంబంధించిన వివరాలు లభించాయి. ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన ప్రయాణికులు పది మంది మాత్రమేనని అర్థమవుతోంది. మిగిలినవారు ఎక్కడివారనేది తెలియడం లేదు.

జబ్బార్ కార్యాలయం వద్ద ఆందోళన

జబ్బార్ కార్యాలయం వద్ద ఆందోళన

మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే ప్రయాణికుల బంధువులు హైదరాబాదులోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు.

పూర్తిగా కాలిపోయింది..

పూర్తిగా కాలిపోయింది..

బస్సు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. బస్సులో ఏమైనా పేలుడు పదార్థాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిలదీస్తున్న బంధువులు

నిలదీస్తున్న బంధువులు

హైదరాబాదులోని జబ్బార్ కార్యాలయంలో ప్రయాణికుల బంధువులు ఇలా నిలదీస్తూ కనిపించారు.

బంధువుల్లో ఆందోళన..

బంధువుల్లో ఆందోళన..

ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రయాణికుల బంధువులు పెద్ద యెత్తున జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు.

బంధువుల్లో ఆందోళన 1

బంధువుల్లో ఆందోళన 1

జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతూ కనిపించారు. వారి ముఖాల్లో అది స్పష్టంగా కనిపించింది.

బిజెపి కార్యకర్తల ఆందోళన

బిజెపి కార్యకర్తల ఆందోళన

హైదరాబాదులోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంస్థపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ముఖంలో విషాదం, ఆందోళన..

ముఖంలో విషాదం, ఆందోళన..

మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

సాధారణంగా బెంగుళూరునుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు బెంగుళూరు మెజిస్టిక్ ప్రాంతంలోనో, కళాసిపాళ్యలోనో బస్సు ఎక్కుతారు. ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ వీరు సీట్లు రిజర్వ్ చేసుకుంటారు. రిజర్వేషన్ దొరకనివారు వందల సంఖ్యలో మెజిస్టిక్ ప్రాంతం, కళాసిపాళ్య, ఆనందబాగ్ మొదలైన ప్రాంతాలలో అనునిత్యం కనిపిస్తుంటారు. వారు ఏ బస్సులో సీటు దొరికితే ఆ బస్సులో ఎక్కుతారు. వారికి సంబంధించిన వివరాలను జబ్బార్ బస్సు యాజమాన్యం తీసుకున్నదీ లేనిదీ తెలియరావడం లేదు.

కాగా, బస్సుకు చెందిన వివరాలు ఆంధ్ర ప్రదేశ్ ఆర్‌టిఏ కార్యాలయంలో లేవు. అయితే బస్సు మాత్రం ఏపీ రిజిస్ట్రేషన్‌తోనే ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల మధ్యా తిరుగుతోంది. పన్ను ఎగగొట్టడానికి ఇలా నడుపుతుంటారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద, బస్సు వ్యవహారం కొంత అయోమయంగానే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+