వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు సందడి: హైటెక్‌లో చెరగని ముద్రే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి హైటెక్ అవతారం ఎత్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మిగతా రంగాలను తగ్గిస్తూ ఆయన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి (ఐటికి) ఇతోధిక ప్రాధాన్యం ఇచ్చారు. హైటెక్ బాబుగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఐటిని ఆయన ఓ తాత్విక చింతనగా ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. హైటెక్ సిటీని తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు.

హైటెక్ సిటీ నిర్మించిన 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శుక్రవారం ఐటి ఉద్యోగులతో సందడి చేశారు. హైటెక్ సిటీలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటి ఉద్యోగులకు రాజకీయ పాఠాలు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వంటివారిని ఆదర్శంగా తీసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఐటి ఉద్యోగులను కూడా తన వైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగించినట్లు అర్థమవుతోంది.

ఆయన ఐటి ఉద్యోగులతో ముచ్చట్లు పెట్టారు. దానికి ముందు మీడియాతో మాట్లాడారు. సేవారంగంలో ఉన్న అవకాశాలను మెరుగు పరచడానికి అనేక ఐటి కంపెనీలను హైదరాబాద్‌లో శాఖలు పెట్టాల్సిందిగా కోరామని, మైక్రోసాఫ్ట్ కంపెనీ సియాటెల్ తర్వాత హైదరాబాద్‌లోనే శాఖను పెట్టేలా తాను బిల్‌గేట్స్‌ను ఒప్పించానని చెప్పారు. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు అనేక పెద్ద కంపెనీలు వచ్చాయని, ఒక సందర్భంలో తాను అమెరికాలో ఫైళ్లను చంకలో పెట్టుకుని రోడ్లపై నడుచుకుంటూ వెళ్లి కంపెనీలతో సమావేశమయ్యాయని ఆయన చెప్పుకున్నారు.

హైటెక్ సిటీలో బాబు ఇలా..

హైటెక్ సిటీలో బాబు ఇలా..

శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ వచ్చి ఇలా ఫోజు ఇచ్చారు. హైటెక్ సిటీ ఘనత తనదేనని చెప్పుకున్నారు.

పాత గెటప్‌లోకి...

పాత గెటప్‌లోకి...

శుక్రవారం హైటెక్ సిటీలో చంద్రబాబు నాయుడు తిరిగి తన పాత గెటప్‌లోకి వచ్చారు. విజయ సంకేతాన్ని మానుకున్న చంద్రబాబు మళ్లీ హైటెక్ సిటీలో ఆ గెటప్‌లో కనిపించారు.

ఐటి ఉద్యోగు చేతుల్లో బాబు పోస్టర్లు..

ఐటి ఉద్యోగు చేతుల్లో బాబు పోస్టర్లు..

చంద్రబాబు హైటెక్ సిటీ సందర్శన సందర్భంగా హంగామా బాగానే జరిగింది. మిమ్మల్ని మిస్సవుతున్నామనే పోస్టర్లను ఐటి ఉద్యోగులు ప్రదర్శిస్తూ కనిపించారు.

కరచాలనం చేయడానికి..

కరచాలనం చేయడానికి..

చంద్రబాబుతో కరచాలనం చేయడానికి హైటెక్ సిటీ ఉద్యోగాలు అర్రు చాచారు. వారిలా ముందుకు వచ్చిన ఆనందం టిడిపి నాయకుడు రామ్మోహన్ రావు ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఐటి ఉద్యోగితో చంద్రబాబు

ఐటి ఉద్యోగితో చంద్రబాబు

ఐటి ఉద్యోగినితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైటెక్ సిటీలో ఇలా.

మీడియాతో చంద్రబాబు

మీడియాతో చంద్రబాబు

హైటెక్‌ సిటీలో మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హైటెక్ సిటీని తానే అభివృద్ధి చేశానని, తన శ్రమ కారణంగానే ఐటి కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని ఆయన చెప్పుకున్నారు.

ఐటి ఉద్యోగులతో..

ఐటి ఉద్యోగులతో..

ఐటి ఉద్యోగులతో హైటెక్ సిటీలో చంద్రబాబు కలిసిపోయారు. రాజకీయాల్లోకి రావాలని వారికి సూచించారు. రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలంటే అది అవసరమని ఆయన అన్నారు.

మురిసిపోయిన బాబు

మురిసిపోయిన బాబు

తన పోస్టర్ల ప్రదర్శనను చూసి, తనతో కరచాలనం చేయడానికి చేతులు చాచడానికి పోటీ పడిన ఐటి ఉద్యోగులను చూసి చంద్రబాబు మురిసిపోయినట్లే కనిపించారు.

నవ్వు ముఖంతో చంద్రబాబు..

నవ్వు ముఖంతో చంద్రబాబు..

తనకు ఆదరణ ఐటి ఉద్యోగుల్లో బాగానే ఉందని అనుకున్నారో ఏమో అరుదుగా నవ్వే చంద్రబాబు హైటెక్ సిటీలో ఇలా నవ్వుతూ కరచాలనం చేస్తూ కనిపించారు.

కేక్ కట్ చేశారు..

కేక్ కట్ చేశారు..

హైటెక్ సిటీ ఏర్పాటు చేసి 15 ఏళ్లు అయిన సందర్భంగా చంద్రబాబు కేక్ కట్ చేశారు. హైటెక్ సిటీలో ఆయన ఓ వెలుగు వెలిగారు.

English summary
Telugudesam president and former CM visited hitech city on friday and mingled with IT employees in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X