వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమ్మడి ఎపి అధినేతలు సీమాంధ్రలోనే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అగ్రనేతలుగా వెలుగొందినవారంతా సీమాంద్రలోనే పోటీ చేస్తున్నారు. రేపు బుధవారం సీమాంధ్రలో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో వారి జాతకాలు బయపడుతాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలోనే పోటీ చేస్తున్నారు. ఆయన తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీమాంధ్రలో టిడిపి గెలిస్తే ఆయన సీమాంధ్రకు (ఆంధ్రప్రదేశ్‌కు) ముఖ్యమంత్రి అవుతారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విభజన నిర్ణయం జరగకముందు రెండు ప్రాంతాలకు నేతగా ముందుకు వచ్చారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి కూడా ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదిలావుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ, తన జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి పోటీలో లేకున్నా సీమాంధ్ర కాంగ్రెసు బాధ్యతలను భుజాన వేసుకున్నారు.

సీమాంధ్రలోనే చంద్రబాబు..

సీమాంధ్రలోనే చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఓటు హక్కు తెలంగాణలోని హైదరాబాదులో ఉంది. ఆయన మాత్రం కుప్పం నుంచి మరోసారి శాసనసభకు పోటీ చేస్తున్నారు. టిడిపి విజయం సాధిస్తే ఆయన కొత్త సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అవుతారు.

జగన్ పులివెందుల నుంచి..

జగన్ పులివెందుల నుంచి..

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పోటీ చేస్తూ వచ్చిన పులివెందుల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పోటీ చేస్తున్నారు. పార్టీ విజయం సాధిస్తే ఆయన సీమాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అవుతారు.

విజయమ్మ కూడా..

విజయమ్మ కూడా..

వైయస్ విజయమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పక్ష నేతగా ఉన్నారు. ఆమె విశాఖ నుంచి లోకసభకు పోటీ చేస్తున్నారు.

జయప్రకాష్ నారాయణ సీమాంధ్రకే..

జయప్రకాష్ నారాయణ సీమాంధ్రకే..

సీమాంధ్రకు చెందిన లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ మాత్రం తెలంగాణలోని మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన గెలిచి, ఎన్డియే అధికారంలోకి వస్తే ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి..

కిరణ్ కుమార్ రెడ్డి..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు శాసనసభా నియో

చిరంజీవి పెద్ద దిక్కే...

చిరంజీవి పెద్ద దిక్కే...

సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి పెద్ద దిక్కు చిరంజీవి. కాంగ్రెసు విజయం సాధించే అవకాశాలు లేవు. అయితే, ఏ మాత్రం బలం చాటుకున్నా ఆయన బలం పెరుగుతుంది.

English summary
The top leaders of United Andhra Pradesh state are fighting election in Seemandhra, which is going for polls on May 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X