‘రిజర్వేషన్లు కల్పించకుంటే..మతం మార్చుకుంటాం’
గాంధీనగర్: రిజర్వేషన్ల కోసం కొంతకాలంగా గుజరాత్‌లో పటేల్ వర్గం చేస్తున్న ఆందోళన మరో మలుపు తిరిగింది. తమ వర్గానికి రిజర్వేషన్లు కల్పించకపోతే మతం మార్చుకొని రిజర్వేషన్ల ఫలాలను అందుకుంటామని పటేల్ వర్గం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది.
ఇప్పటికే పటేల్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్‌ను నిలువరించిన గుజరాత్ ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేసిన యత్నాలు దాదాపుగా ఫలించాయనే చెప్పాలి. అయితే ప్రభుత్వం ఊహించని విధంగా హార్దిక్ అనుచరులు కొత్త వాదనను ప్రభుత్వం ముందు పెట్టారు.

‘మా డిమాండ్ మేరకు ఓబీసీ రిజర్వేషన్లను అందించండి. లేకపోతే రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడానికి కూడా మేం సిద్ధమే' అని వారు ఆందోళనకు దిగారు.
ఈ మేరకు వారు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఇటీవల పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ నెట్‌వర్క్‌లో హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications