మోడీపై బాబు గుర్రు: రోడ్డెక్కుతానని పవన్, జేపీ జత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ కోసం అవసరమైతే రోడ్డెక్కుతానని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలె ప్రకటించారు. తాజాగా లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ కూడా ప్రధాని మోడీ ప్రభుత్వం పైన ప్రత్యక్ష పోరుకు సిద్ధమని ప్రకటించారు.
ఆసక్తికర విషయమేమంటే.. ఇరువురు నేతలు కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోడీకి అనుకూలంగా మాట్లాడటం, మద్దతివ్వడం చేసినవారే. సార్వత్రిక ఎన్నికల సమయంలో జేపీ నాడు మోడిని కలిశారు. ఆ సమయంలో మోడీ.. జేపీకి కితాబిచ్చారు. మీలాంటి నేతలు పార్లమెంటులో ఉండాలన్నారు. మల్కాజిగిరి నుండి పోటీ చేసిన జేపీకి మద్దతివ్వలేకపోయినందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒకింత అసంతృప్తి చెందారనే చెప్పవచ్చు.
నాడు ప్రధాని మోడీకి అనుకూలంగా ఉన్న జేపీ, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఇప్పుడు అదే బీజేపీ పైన ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమని చెబుతున్నారు. విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపిస్తున్నారు.

పునర్విభజన చట్టంలో రాష్ట్ర ప్రయోజనాలనుద్దేశించి పేర్కొన్న అంశాలు, కేంద్రం ప్రభుత్వం నుంచి లభించిన హామీలన్నింటినీ తూచా తప్పక అమలు చేయించేందుకు ఇక మాటలు, విజ్ఞాపనలతో కాకుండా ప్రత్యక్ష పోరుకు దిగాల్సిన సమయం ఆసన్నమైందని జేపీ ఆదివారం అన్నారు. ప్రధానంగా నాలుగు అంశాల్లో ఏమాత్రం జాప్యం జరిగినా ఈ రాష్ట్రం అంధకారమయం కావటమే కాకుండా వల్లకాడుగా మారుతుందన్నారు.
ఇందుకు సంబంధించి ఏపీలోని రాజకీయ పక్షాల నేతలు, మేధావులు, కార్మిక ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు తదితరులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. 16వ తేదీ నుండి గ్రామస్థాయి నుండి పాఠశాలలు, కళాశాలల వరకు రెండు గంటల పాటు మానవహారాలు నిర్వహిస్తామన్నారు.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత కొద్దిరోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అరకొర నిధులతో సరిపెట్టడంతో రాష్ట్రం ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటోందన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుండి నిధులు సక్రమంగా అందడం లేదన్నారు.
దీనికితోడు రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగకపోవడం, ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదన్నారు. ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తగినన్ని నిధుల కేటాయింపులు జరగలేదన్నారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications