వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్: ఛార్జీషీట్లలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలలో ఆయా కంపెనీలు రూ.1,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయట. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మంగళవారం వరకు పది ఛార్జీషీట్స్‌ను దాఖలు చేసింది.

గతంలో ఐదు ఛార్జీషీట్స్ దాఖలు చేసిన సిబిఐ ఇటీవల పెన్నా, ఇండియా, భారతి సిమెంట్స్ అంశాలలో, మంగళవారం ఇందు ప్రాజెక్ట్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశాలలో అభియోగపత్రాలు నమోదు చేసింది. పది ఛార్జీషీట్స్‌లలో కలిపి జగన్ సంస్థలలో ఆయా కంపెనీలు పన్నెండు వందల కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.

నిన్నటి ఛార్జీషీటులో ఇందు ప్రాజెక్టు రూ.70 కోట్లు పెట్టినట్లుగా సిబిఐ అభియోగం నమోదు చేసింది. మరోవైపు నిన్నటి ఛార్జీషీట్‌లలో సిబిఐ సండూరు పవర్ ప్రాజెక్టుకు, సూటుకేసు కంపెనీలకు సంబంధించిన అంశాలపై ఛార్జీషీట్స్ దాఖలు చేయలేదు. దీంతో మరికొన్ని ఛార్జీషీట్స్ దాఖలు చేసే అవకాశముందంటున్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జగన్ ఇటీవల తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సిబిఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దానిపై కోర్టు సిబిఐకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత సిబిఐ ఐదు ఛార్జీషీట్స్ దాఖలు చేసింది. ఇవాళ బెయిల్ పైన విచారణ జరగనుంది.

English summary

 In the ten chargesheets that the CBI has filed, it has alleged that altogether more than Rs.1,200 crore was invested in YS Jaganmohan Reddy's firms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X