Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'సెల్ఫీలతో సచిన్ సందడి, లక్ష్మణ్‌ చెప్పలేదు' (ఫోటోలు)

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ స్మాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ పార్క్‌ను సచిన్ ప్రారంభించారు.

వేలాదిగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులతో సచిన్‌ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సచిన్ టెండూల్కర్ సమాధానాలిచ్చాడు. అంతేకాదు హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్


హైదరాబాదీ బిర్యానీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. వీవీఎస్‌ లక్ష్మణ్‌, నేను కలిసి చానాళ్లు భారత జట్టుకి ఆడాం. అప్పట్లో మా మధ్య బిర్యానీ చర్చ అంతగా వచ్చేది కాదని అన్నారు.

 ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఐపీఎల్‌లో మా జట్టు (ముంబై ఇండియన్స్) హైదరాబాద్‌కి చెందిన క్రికెటర్లు అంబటి రాయుడు, ప్రజ్ఞాన్‌ ఓఝా ముంబై ఇండియన్స్‌ సభ్యులు కావడంతో తమ చర్చంతా హైదరాబాదీ బిర్యానీపైనే నడిచేదని సచిన్‌ అన్నాడు.

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్


బిర్యానీ గురించి చెప్పడమే కాదు, రుచి చూపించాడు కూడా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా బిర్యానీ తినకుండా తిరిగి వెళ్లను. నాతోపాటు ఉండే ఇండియన్ క్రికెటర్లకే కాదు విదేశీ క్రికెటర్లకు కూడా సిటీకి వస్తే బిర్యానీ తినిపిస్తానని చెప్పారు.

 ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఇక ఫలక్‌నుమా ప్యాలెస్‌ సూపర్‌ విషయానికి వస్తే హైదరాబాద్‌లోని ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన ఫలక్‌నుమా ప్యాలెస్‌ ఒకటని అన్నారు. హైదరాబాద్‌లోని నా స్నేహితులు ఫలక్‌నుమా ప్యాలెస్‌ గు రించి ఎంతో గొప్పగా చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్యాలెస్‌లో రెండ్రోజులు గడిపానని, అదో అద్భుత కట్టడమని సచిన్ అన్నారు.

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్


శ్రీలంక పేసర్ లసిత్ మలింగ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారు అని ఓ క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ సరదాగా సమాధానం చెప్పారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు తురుపుముక్కగా ఉన్న మ లింగను ‘బాహుబలి'తో పోల్చడం ఆసక్తిని రేకెత్తించింది.

 ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

మలింగ అసలు సిసలైన చాంపియన్‌. ముంబై జట్టుకు అతడు ‘బాహుబలి' లాంటివాడని సచిన్‌ చెప్పారు. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకునే మలింగ.. గంపగుత్తలా ఉండే విచిత్రమైన తన హెయిర్‌స్టయిల్‌తోనూ అభిమానులను అంతే అలరిస్తుంటాడని పేర్కొన్నారు.

 ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్


లండన్‌లో బస్ మిస్సయిందని ట్వీట్ చేశారు కదా అని అడిగితే అదంతా ఓ జోక్ అని సచిన్ చెప్పారు. ‘వాస్తవానికి లండన్‌లో బస్‌ మిస్‌ కాలేదు. ఫ్రెండ్స్‌తో కలిసి భోజనానికి వెళ్లినపుడు కనిపించిన బస్టాండ్‌లో ఫొటోలు దిగి వాటిని ట్విట్టర్‌లో పెట్టాను. వెంటనే రీట్వీట్‌ కూడా చేశాను. నేను బస్‌ మిస్‌కాలేదు కానీ.. మీరే జోక్‌ మిస్సయ్యార'ని పేర్కొన్నాడు.

 ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

ఫలక్‌నుమా అద్భుతం, బిర్యానీపైనే: సచిన్

వేగంగా దూసుకుపోయే ఫార్ములావన్ కారును నడిపాంటే మంచి ఫిట్‌నెస్ ఉండాలి. దానిని నేను సక్సెస్‌ఫుల్‌గా నడిపాను. రేసింగ్ దిగ్గజం మైకేల్ షూమాకర్ గిప్ట్‌గా ఇచ్చిన ఎఫ్-1 కారుని నడిపే ఇండియాలో రోడ్లు లేవు. అందుకే దాన్ని అమ్మేసానని సచిన్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+