సెల్ఫీతో ఆ ఇద్దరినీ కలిపిన సానియా మిర్జా(ఫోటో)
న్యూఢిల్లీ: 2015లో భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు కనబర్చిన సానియా శనివారం కోర్టు బయట మరో అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది.
సానియా మిర్జా, భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, మహేష్ భూపతితో తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఆ సెల్ఫీ కింద ‘మేరే కరణ్-అర్జున్ ఆగయే' అంటూ కాప్షన్ కూడా రాసి ఆ సెల్ఫీకి మరింత అందం తీసుకొచ్చింది.
టెన్నిస్‌లో భారత్ తరుపున లియాండర్ పేస్-మహేశ్ భూపతి అత్యంత విజయవంతమైన జోడీ. భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన వీరిద్దరూ గత కొంతకాలంగా విడిపోవడంతో పాటు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.

ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సానియా వీరిద్దరినీ మళ్లీ ఒకే కోర్టులోకి తీసుకొచ్చింది. అంతేకాదు టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా, భూపతి, పేస్‌తో కలిసి సానియా ఈనెల 25, 26, 27వ తేదీల్లో మూడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడనుంది.
ఇందుకోసం మహేశ్ భూపతి, లియాండర్ పేస్‌తో శనివారం ఆమె ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా వారితో కలిసి సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ సెల్ఫీతో యావత్ భారత టెన్నిస్ అభిమానులు ఒకింత సంతోషానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా విడిపోయి ఎడమొహం పెడమొహంగా ఉంటున్న లియాండర్ పేస్, మహేశ్ భూపలిద్దరూ ఈ సెల్ఫీతో ఒక్కటయ్యారని అందరూ భావిస్తున్నారు.
Mere Karan - Arjun aagaye 😏 @Maheshbhupathi @Leander will decide which one is which 😜 pic.twitter.com/WlRKIrO37W
— Sania Mirza (@MirzaSania) November 21, 2015 











Click it and Unblock the Notifications