శశికళకు కన్నీరే: కేసు పూర్వపరాలు ఇవీ...
జయలలిత, శశికళలపై, ఇతరులపై పెట్టిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పలు మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శశికళకు కన్నీరే మిగిలింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శశికళను సుప్రీంకోర్టు తీర్పు చావు దెబ్బ తీసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆమె రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని భావిస్తన్నారు.
జయలలిత 1991-96 మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మంచి రూ.66 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నారనేది కేసు.. ఇందులో జయలలితతో పాటు ఆమె నెచ్చెలి శశికళ, ఆమె బంధువులు ఇలవరిశి, విఎన్ సుధాకరన్లు కూడా నిందితులుగా ఉన్నారు.
ఆ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆ కేసు పూర్వపరాలివీ...

అప్పుడు సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదుతో...
1996 ఎన్నికల్లో అన్నాడియంకె ఓటమిపాలై డిఎంకె అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జూన్ 14వ తేదీన ప్రస్తుత బిజెపి పార్లమెంటు సభ్ుడు సుబ్రహ్మణ్య స్వామి జయలలితపై ఫిర్యాదు చేశారు. దాంతో డిఎంకె ప్రభుత్వం జయలలితపై కేసు నమోదు చేసింది. ఏడాది తర్వాత జయలలిత, శశికళ, ఇళవరశి, సుధాకరన్‌లపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

జయలలిత ఆస్తులు ఇలా...
జయలలితకు చెందిన చెన్నైలోని ఫామ్ హౌస్‌లు, బంగళాలు, తమిళనాడులో వ్యవసాయ భూమి, హైదరాబాదులో ఫామ్ హౌస్, నీలగరి కొండల్లో ఒక టీ ఎస్టేట్, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ కార్ల శ్రేణి తదితర ఆస్తులు ఈ కేసు పరిధిలో ఉన్నాయి.

సోదాల్లో సొమ్ములు ఇలా...
జయలలిత నివాసంలో 1997లో సోదాలు నిర్వహించి 800 కిలోల వెండి, 28కిలోల బంగారం, 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ వాల్ట్‌లో ఉంచారు. వాటిని బెంగళూరు తరలించాలని 2014లో ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు.

కర్ణాటక హైకోర్టుకు కేసు బదిలీ..
2001 మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిఎంకె ఓడిపోయి అన్నాడియంకె అధికారంలోకి వచ్చింది. దాంతో కేసు విచారణను తమిళనాడు వెలుపలకి బదిలీ చేయాలని 2003లో సుప్రీంకోర్టును కోరారు. దాంతో కేసు కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పు ఇలా..
కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు 2014 సెప్టెంబర్ 27వవ తేదీన తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక చట్టంంలో 13(1), 13(2) సెక్షన్ల కింద జయలలితను కోర్టు దోషిగా తేల్చింది. శశికళ, మిగతా ఇద్దరిని ఐపిసిలోని 120బి, 109 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది. నలుగురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జయలలిత రూ.100 కోట్లు, మిగతా ముగ్గురు తలా రూ.10 కోట్ల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది.

జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా...
ఆ తీర్పు వెలువడిన సమయంలో జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో ఒక ముఖ్యమంత్రిని దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష వేయడం ఇదే తొలిసారి. ఈ తీర్పుతో జయలలిత ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి అనర్హురాలయ్యారు. ఆ పదవులను ఆమె కోల్పోయారు. కోర్టుకు హాజరైన జయలలితను తీర్పు వెలువడిన వెంటనే పారప్పణ ఆగ్రహార జైలుకు తరలించారు. శశికళ సహా మిగతా వాళ్లను ఇతర జైళ్లకు తరలించారు.

తీర్పుపై అప్పీల్ చేసిన జయలలిత..
ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో జయలలిత, ఇతరులు అప్పీల్ చేశారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 2014 అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. 2015 మే 11వ తేదీన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సిఆర్ కుమారస్వామి ట్రయల్ కోర్టు తీర్పును కొట్టేశారు. జయలలితపై, శశికళపై, ఇతరులపై అభియోగాలను రద్దు చేశారు. దీంతో జయలలిత అదే నెల 23వ తేీదన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేప్టటారు.

సుప్రీంకు వెళ్లిన కర్ణాటక హైకోర్టు
జయలలిత తదితరులును నిర్దోషులుగా విడుదల చేస్తూ కర్ణాటక ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును అత్యంత వేగంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేిసంది. జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన మరణించారు. శశికళ సహా మిగతా ముగ్గురిపై కేసును కొనసాగించిన సుప్రీంకోర్టు మంగళవారంనాడు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో శశికళ ముఖ్యమంత్రి ఆశలు గల్లంతయ్యాయి.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications