దానికి అభిమాని ఫిదా: అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ 'రాజకీయం'! 2019కి హింట్ ఇచ్చారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు. పవన్ సినిమా అంటేనే యువతలో ఓ విధమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఇక, అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

  పవన్ కళ్యాణ్ సీఎం కావాలి: ప్రత్యేక పూజలు

  గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు నిరీక్షించడానికి, ఈసారికి తేడా ఉంది. ఆయన మాటలను బట్టి, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సమీప కాలంలో మరో సినిమా రాకపోవచ్చు. దీంతో అభిమానులు గతంలో కంటే భిన్నంగా వేచి చూశారు.

  రాజకీయాలపై దృష్టి సారించనున్న పవన్ కళ్యాణ్

  రాజకీయాలపై దృష్టి సారించనున్న పవన్ కళ్యాణ్

  రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. దీంతో ఈ సినిమాలో ఏమైనా రాజకీయపరమైన డైలాగులు ఉంటాయా అనే చర్చ సాగింది. చాలామందిలోను ఈ ఉత్కంఠ కనిపించింది.

  అక్కడక్కడా డైలాగులు

  అక్కడక్కడా డైలాగులు

  కానీ, సినిమాలో పెద్దగా రాజకీయపరమైన డైలాగులు లేవు. అయితే అక్కడక్కడా విసిరిన రెండు మూడు డైలాగుల్లో మాత్రం రాజకీయం దాగి ఉందని అంటున్నారు. అవి పరోక్షంగా ప్రస్తుతం ఆయన రాజకీయ ఉద్దేశ్యాన్ని చెప్పేలా ఉన్నాయి.

  రెండు డైలాగులు

  రెండు డైలాగులు

  ఇందులో రెండు డైలాగులు ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి సైకిల్ ఎక్కే డైలాగ్. రెండోది రాజ్యం మీద ఆశలేని రాజు. ఈ రెండు డైలాగులను పవన్ కళ్యాణ్ నిజ రాజకీయ జీవితానికి వర్తింప చేస్తున్నారు.

  టీడీపీతో కలయికపై చర్చ సమయంలో

  టీడీపీతో కలయికపై చర్చ సమయంలో

  'వీడు మళ్లీ సైకిల్ ఎక్కుతాడంటావా' అంటే సైకిల్ ఎక్కుతాడో లేదో మనల్ని మాత్రం ఎక్కకుంటే చాలు అనే డైలాగ్ ఉంది. ఇది సినిమా విడుదలకు ముందు చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ - బీజేపీకి మద్దతిచ్చారు. 2019లో పవన్ ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఈ డైలాగ్ చర్చకు తావిచ్చింది. సైకిల్ ఎక్కుతారా అనే డైలాగ్‌తో పవన్ కళ్యాణ్ ఏదైనా హింట్ ఇచ్చినట్లేనా అనే చర్చ సాగుతోంది. అంటే టీడీపీతో మరోసారి కలిసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

  మరో డైలాగ్‌కు పవన్ ఫ్యాన్ ఫిదా

  మరో డైలాగ్‌కు పవన్ ఫ్యాన్ ఫిదా

  దాని కంటే కీలకమైన డైలాగ్ మరొకటి ఉంది. ఈ డైలాగ్‌కు పవన్ అభిమానులు ఊగిపోతున్నారు. బోమన్ ఇరానీ ఓ సందర్భంలో ఓ డైలాగ్ చెబుతారు. రాజ్యం మీద ఆశలేని వాడి కంటే గొప్ప రాజు ఎవరు ఉంటారు అని అంటారు.

  పవన్ నిజ జీవితంలోను

  పవన్ నిజ జీవితంలోను

  ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్‌కు నిజ జీవితంలోను సరిపోతుందని జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది అన్నారు. తాను పదవుల కోసం, అధికారం కోసం పార్టీని స్థాపించలేదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఇది పవన్ నిజ జీవితానికి సరిపోతుందని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Some political dialogues in Jana Sena chief and Power Star Pawan Kalyan's Agnyaathavaasi movie.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి