వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు మరో భారీ షాక్: కారెక్కనున్న మోత్కుపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబుకు మరో భారీ షాక్.. కారెక్కనున్న మోత్కుపల్లి..!

హైదరాబాద్: తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనక తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు పక్కా ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుపై ఆయన గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పచ్చజెండా ఊపిన తర్వాతనే ఆయన చంద్రబాబుపై విమర్శలు చేసినట్లు భావిస్త్నారు.

 గతంలో కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన మోత్కుపల్లి

గతంలో కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన మోత్కుపల్లి

గతంలో మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి ఇటీవలి దాకా కెసిఆర్‌ను ఎదుర్కోవడమే ధ్యేయంగా ఉన్నట్లు మాట్లాడుతూ వచ్ారు. అయితే, ఒక్కసారిగా ఆయన తన వైఖరి మార్చుకుని తెరాసకు అనుకూలంగా మాట్లాడారు.

 మోత్కుపల్లిపై కేసిఆర్ ఆలోచన ఇదీ...

మోత్కుపల్లిపై కేసిఆర్ ఆలోచన ఇదీ...

మోత్కుపల్లిని చేర్చుకుంటే తెలంగాణలో బలంగా ఉన్న మాదిగ సామాజిక వర్గంలో పట్టు లభిస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పియస్ నేత మందకృష్ణ మాదిగ కేసిఆర్‌పై ధ్వజమెత్తుతున్న తరుణంలో మోత్కుపల్లిని పార్టీలోకి తీసుకుంటే ఆయనకు మద్దతు తగ్గుతుందని కేసిఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 చంద్రబాబు హామీలు హుష్‌కాకి..

చంద్రబాబు హామీలు హుష్‌కాకి..

మోత్కుపల్లి నర్సింహులుకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. ఇక ముందు నెరవేరుతాయనే ఆశ కూడా లేదు. గవర్నర్ పదవి వచ్చేలా చూస్తానని చంద్రబాబు అప్పట్లో మోత్కుపల్లికి హామీ ఇచ్చారు. అయితే, బిజెపి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సూచనను పక్కనపెట్టినట్లు చెబుతున్నారు.

 రాజ్యసభకైనా పంపాలని..

రాజ్యసభకైనా పంపాలని..

గవర్నర్ పదవి వచ్చే అవకాశం లేకపోవడంతో కనీసం రాజ్యసభకైనా పంపాలని మోత్కుపల్లి అడిగినట్లు చెబుతున్నారు. అది నెరవేర్చాలంటే మోత్కుపల్లిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. దాంతో మోత్కుపల్లి రెండో అభ్యర్థనను కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. దాంతో చంద్రబాబుపై మోత్కుపల్లి అసంతృప్తితో న్నారు.

 టిడిపితోనే రాజకీయ జీవితం...

టిడిపితోనే రాజకీయ జీవితం...

తెలుగుదేశం పార్టీతోనే మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎన్టీ రామారావు ఆయనకు టిడిపి టికెట్ ఇవ్వడంతో ఆలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి గెలిచారు. అప్పటి నుంి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం టిడిపికి తెలంగాణలో భవిష్యత్తు లేదనే పరిస్థితి రావడంతో ఆయన పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.

 రేవంత్ రెడ్డి అటు వెళ్లడంతో...

రేవంత్ రెడ్డి అటు వెళ్లడంతో...

టిడిపిలో తన ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరడంతో మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

 మోత్కుపల్లికి ఇలా సానుకూలం..

మోత్కుపల్లికి ఇలా సానుకూలం..

ఓ మంత్రితో సహా కేసిార్ వ్యక్తిగత సహాయకుడితో మోత్కుపల్లి నర్సింహులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేసిఆర్ అనుమతి కోసం ఆయన కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మందకృష్ణ మాదిగ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మందకృష్ణ అరెస్టు తదితర పరిణామాల నేపథ్యంలో తెరాసపై మాదిగ సామాజిక వర్గం తెరాసకు వ్యతిరేకంగా మళ్లే ప్రమాదం ఏర్పడింది.

 మోత్కుపల్లికి హామీ...

మోత్కుపల్లికి హామీ...

ఆ స్థితిలో మోత్కుపల్లి నర్సింహులును పార్టీలో చేర్చుకుంటే పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవచ్చునని కేసిఆర్ భావించినట్లు సమాచారం. దాంతో మోత్కపల్లి చేర్చుకోవడానికి కేసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మోత్కుపల్లిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని అంటన్నారు.

English summary
It is said that Telugu Desam party Telangana leader Mothkupalli Narsimhulu may join in CM K Chandrasekhar Rao lead Telangana Rastra Samithi (TRS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X