హరికృష్ణకు విరుగుడు: రాజ్యసభకు బాలయ్య?

రాజ్యసభకు ఫిబ్రవరి 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే స్థానాల్లో హరికృష్ణ రాజీనామా చేయడం ద్వారా ఖాళీ అయిన స్థానం కూడా ఉంది. ఎన్టీ రామారావు కుటుంబానికి చెందిన సీటును ఎన్టీ రామారావు కుటుంబానికే ఇచ్చామని చెప్పుకోవడానికి హరికృష్ణ ఖాళీ చేసిన సీటును ఆయన సోదరుడు బాలయ్యకు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. బాలకృష్ణ మాత్రం శాసనసభకు పోటీ చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు.
ప్రస్తుత శానససభా బలాబలాలను బట్టి రాజ్యసభకు ఇద్దరు తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికయ్యే అవకాశం ఉంది. టిడిపి 81 మంది శాసనసభ్యుల బలం ఉంది. 2008లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో హరికృష్ణను రాజ్యసభకు నామినేట్ చేశారు. తెలంగాణ అంశంపై చంద్రబాబుతో హరికృష్ణ విభేదిస్తున్నట్లు కనిపించారు. అంతేకాకుండా క్రమంగా హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
పార్టీలో హరికృష్ణ కన్నా బాలకృష్ణ ఎక్కువ చురుగ్గా పనిచేస్తున్నారని భావనతో చంద్రబాబు ఉన్నారు. రెండు రాజ్యసభ సీట్లలో ఓ సీటుకు బాలయ్యను నామినేట్ చేస్తే మరో సీటు తెలంగాణ నేతకు ఇవ్వాల్సి ఉంటుంది. మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ ఆ సీటుకు పోటీ పడుతున్నట్లు సమాచారం.
బాలయ్యను కాకపోతే కంభంపాటి రామ్మోహన్ రావు లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. అపెక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్ టిడి జనార్దన్ రావు కూడా ఈ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications