టెక్కీతో పాటు ఇతర మిస్సింగ్ కేసుల మిస్టరీ
హైదరాబాద్: మిస్సింగ్ కేసులు హైదరాబాదులో మిస్టరీగా మారుతున్నాయి. టెక్కీ భవ్యశ్రీతో పాటు పలు మిస్సింగ్ కేసుల మిస్టరీ వీడడం లేదు. విద్యార్థులు తన్మయి, శోభ, బ్రాహ్మణబస్తీకి చెందిన లతాశ్రీ, న్యూషాపూర్‌నగర్‌కు చెందిన జాహ్నవి - అదృశ్యమయ్యారు. రోజుల వ్యవధిలో ఇంటి కనిపించకుండా పోయారు. వీరిలో ఏ ఒక్కరి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రస్తుతం ఈ కేసులన్నీ పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.
టెక్కీ భవ్యశ్రీ కేసు గురువారం రాత్రి వెలుగులోకి రాగా మిగిలిన కేసులన్నీ శుక్రవారం పోలీస్‌స్టేషన్లకు చేరాయి. పోలీసులు వీటిని ఛేదించే పనిలో పడ్డారు. హైదరాబాదులోని భరత్‌నగర్ ఎంఐజీ 88లో ఉంటున్న కోనేరు సాయికృష్ణ కుమార్తె తన్మయి (11), మూసాపేటలోని సర్దార్‌పటేల్ నగర్‌కు చెందిన కృష్ణ కుమార్తె శోభ (11) భరత్‌నగర్ కాలనీలోని స్ర్పింగ్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నారు. తన్మయి సరిగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక గురువారం పాఠశాలకు భోజనం తీసుకెళ్లకుండా వెళ్లింది.
భోజన విరామ సమయంలో స్నేహితురాలు శోభతో ఆమె ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో శోభ తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఇద్దరూ దుస్తులు మార్చుకుని ఇంట్లో 130 రూపాయలు తీసుకుని బయటకు వచ్చారు. సాయంత్రం పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో సమీపాన ఉన్న బస్టాప్‌లు, భరత్‌నగర్ రైల్వేస్టేషన్‌లో గాలించారు.

స్టేషన్‌లోని కౌంటర్‌లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. ఇద్దరు పిల్లలు వచ్చారని,గుంటూరు వెళ్లడానికి టికెట్ అడిగారని, ఇక్కడి నుంచి గుంటూరుకు రైళ్లు ఉండవని చెప్పడంతో బోరబండకు టికెట్ తీసుకున్నారని కౌంటర్‌లోని సిబ్బంది చెప్పారు. ఇదే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. బోరబండ వైపు వెళ్లే రైలెక్కిన విద్యార్థినులు ఎక్కడికి వెళ్లారన్నది మిస్టరీగా మారింది. తన్మయి, శోభ ఆచూకీ కనుగొని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించేందుకు సనత్‌నగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
హైదరాబాదులోని వారాసిగూడ బ్రాహ్మణబస్తీకి చెందిన 20 ఏళ్ల లతాశ్రీ స్నేహితుల వద్దకు వెళ్తున్నానని ఒకటో తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. తండ్రి శ్రీనివాసులు పలుచోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీనిపై ఆయన చిలకలగూడ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
హైదరాబాదులోనిన్యూషాపూర్‌నగర్‌కు చెందిన జాహ్నవి (14) మూడో తేదీ ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహి తుల ఇళ్ల వద్ద గాలించినా ఫలితం లేకపోవ డంతో బాలిక తండ్రి స్టీఫెన్ మోజెస్ జీడిమెట్ల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
సయీద్ అలీగూడలో పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినిలు కనిపించకుండాపోయారు. సయీద్ అలీగూడకు చెందిన సఫీ ఉన్సీసా (13), తన్వీర్ జాస్మిన్ (13) స్థానికంగా ఉన్న సోనా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠ శాలకు వెళ్లిన వీరు తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications