ఏపీ, తెలంగాణ గొడవ: జలజగడంపై కేంద్రం జోక్యం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి గొడవ పైన కేంద్రం స్పందించింది. చర్చించేందుకు ఇరు రాష్ట్రాలకు పిలిచింది. ఈ నెల 18వ తేదీన రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ కానున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు పరిధి పైన నిర్ణయించనున్నారు. బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శి హాజరవుతారు.

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో వివాదం పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.

బోర్డు పరిధి, విధివిధానాలకు సంబంధించిన ముసాయిదాను కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆరునెలల క్రితమే రెండు రాష్ట్రాలకు పంపింది. అయితే, దీనిపై చర్చించి అభిప్రాయాలు చెప్పడంలో రెండు ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేశాయి. పైగా రెండు రాష్ట్రాలు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

బోర్డు సూచనలు ఖాతరు చేసే పరిస్థితి లేకపోవడంతో సమావేశం నిర్వహించడానికి కూడా ఆసక్తి చూపని బోర్డు ఒక రాష్ట్రం పంపిన లేఖలు ఇంకో రాష్ట్రానికి పంపడం, లేఖలు రాయడం వరకే పరిమితం అయ్యింది.

Telangana-Andhra Pradesh water conflict: Central Government calls

గత ఖరీఫ్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి నీటి విడుదల వివాదాస్పదం కావడంతోపాటు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. బోర్డు ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పరిధి ఏంటో కూడా ఖరారు కాలేదు.

మళ్లీ ఖరీఫ్‌ ప్రారంభం కావడంతో బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, అధికారులు బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కేంద్ర జలవనరుల మంత్రి, ఇతర అధికారులకు విజ్ఞప్తి చేశారు.

దీనిపై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కృష్ణానదీ యాజమాన్య బోర్డును నివేదిక కోరింది. ప్రస్తుత పరిస్థితిలో కాలువల నిర్వహణను చేపట్టలేమని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ హెడ్‌వర్క్స్‌ ను మాత్రమే నోటిఫై చేయాలని బోర్డు కేంద్రం దృష్టికి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+