వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి మెలిక: బాబుకు కలిసొచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

బాబుకు కలిసొచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు

హైదరాబాద్: ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిసి వచ్చినట్లే ఉంది. ఆ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం మోడీకి ఏర్పడింది.

రాజ్యసభలో తగిన బలం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి కష్టంగా మారింది. దీంతో మోడీ చంద్రబాబు సాయం కోరాలని అనుకుంటున్నారు. దీన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.

 చాలా కాలంగా మోడీతో భేటీకి...

చాలా కాలంగా మోడీతో భేటీకి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కాలంగా మోడీతో భేటీకి ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా చంద్రబాబు మోడీని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ట్రిపుల్ తలాఖ్ బిల్లు చంద్రబాబుకు కలిసిన వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీన లేదా 17వ తేదీన చంద్రబబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.

 చంద్రబాబు మెలిక ఇదీ...

చంద్రబాబు మెలిక ఇదీ...

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు చంద్రబాబు మెలిక పెడుతన్నారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లును పూర్తిగా వ్యతిరేకించకుండా దాన్ని నేరంగా పరిగణించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. బిల్లులో మార్పులు చేయకుండా ట్రిపుల్ తలాఖ్ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని కేంద్రం ఆలోచనగా ఉంది. అందువల్ల చంద్రబాబుతో భేటీలో మోడీ అందుకు సహకరించాలని అడిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రానికి ఎదరువుతున్న పోలవరంతో పాటు ఇతర సమస్యలను మోడీ చంద్రబాబు ముందు పెట్టే అవకాశం ఉంది.

చంద్రబాబు వాదన ఇదీ...

చంద్రబాబు వాదన ఇదీ...

ట్రిపుల్ తలాఖ్‌ను కోర్టు తిరస్కరిస్తోంది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ బిల్లు ప్రవేశపెడితే సరిపోతుందని, దాన్ని నేరంగా పరగణించే క్లాజ్‌ అవసరం లేదని చంద్రబాబు వాదిస్తున్నారు. దాన్ని నేరంగా పరిగణిస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని చంద్రబాబు అంటున్నారు. లోకసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలు అవే.

ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై ఇదీ అభిప్రాయం...

ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై ఇదీ అభిప్రాయం...

ముస్లిం మహిళలకు రక్షణ కల్పించాలంటే ట్రిపుల్ తలాఖ్ బిల్లు అవసరమని 68 శాతం మంది ముస్లింలు, 82 శాతం మంది హిందువులు అభిప్రాయపడుతున్నారని, ఇది తాను చేయించిన సర్వేలో తేలిందని చంద్రబాబు చెప్పారు. దీంతో చంద్రబాబు పెట్టిన అడ్డును తొలిగింపజేసుకోవడానికి మోడీ చంద్రబాబు సాయం కోరే అవకాశం ఉంది.

English summary
PM Narendra Modi is likely to seek the support of AP Chief Minister N. Chandrababu Naidu in getting the triple talaq Bill passed in Parliament in its present form.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X