సిఎం కెసిఆర్ ‘విశ్వ’నగరం ఇలావుంది(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే తన బలమైన ఆకాంక్షను ప్రజలతో పంచుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సమస్యలు- పరిష్కార మార్గాలపై ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో నగరానికి చెందిన మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలతో మాట్లాడారు.
కొత్త రాష్ట్రంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాలంటే కల్పన ఉండాలి, ఆ విజన్‌ను కార్యాచరణగా మార్చడానికే అనేక చర్యలు తీసుకుంటున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. అభివృద్ధి చెందనున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సచివాలయాన్ని ఇంకో చోటికి తరలించాలని నిర్ణయిస్తే, దానిని సరిగ్గా అర్థం చేసుకోలేని వారు అనవసర రాద్ధాంతాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
దేశంలో అన్ని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటాపోటీగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పెరుగుతున్న జనాభాను అంచనా వేసి అందుకు అనుగుణంగా అభివృద్ధి పర్చడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. జంట నగరాలలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాలంటే శస్త్ర చికిత్సలాంటి పనులు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిని కోరుకునే వారి సహాయ, సహకారాలు ప్రభుత్వానికి కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు కట్టించక పోవడంతో 30,40 ఏళ్ల నుంచి గుడిసెల్లోనే పేదలు తమ బతుకులను ఈడ్చుతున్నారని అన్నారు. మురికివాడలలో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దుర్భర పరిస్థితులు చూసి చాలా బాధపడ్డానన్నారు. ఈ కారణంగానే పేదలు ఎక్కడ నివాసిస్తే అక్కడే వారికి పట్టాలు ఇచ్చి క్రమబద్దీకరించాలని నిర్ణయించి జీవో 58 విడుదల చేశామన్నారు. అలాగే ప్రభుత్వ ఆక్రమిత స్థలాలలో ఇళ్లు నిర్మించుకున్న మధ్య తరగతి ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించి వాటిని క్రమబద్ధీకరిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి(నమూనా)
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే తన బలమైన ఆకాంక్షను ప్రజలతో పంచుకున్నారు.

ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి(నమూనా)
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సమస్యలు- పరిష్కార మార్గాలపై ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో నగరానికి చెందిన మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలతో మాట్లాడారు.

రవీంద్ర భారతి ఇలా
కొత్త రాష్ట్రంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాలంటే కల్పన ఉండాలి, ఆ విజన్‌ను కార్యాచరణగా మార్చడానికే అనేక చర్యలు తీసుకుంటున్నామని సిఎం కెసిఆర్ అన్నారు.

రవీంద్ర భారతి ఇలా
అభివృద్ధి చెందనున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సచివాలయాన్ని ఇంకో చోటికి తరలించాలని నిర్ణయిస్తే, దానిని సరిగ్గా అర్థం చేసుకోలేని వారు అనవసర రాద్ధాంతాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.

కెసిఆర్
జంట నగరాలలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాలంటే శస్త్ర చికిత్సలాంటి పనులు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications