వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్: అమ్మాయిలతో రాసలీలల్లో, మ్యూజిక్ అంటే పిచ్చి, అమెరికాపై శత్రుత్వానికి కారణమిదే!

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ప్రపంచాన్ని శాసిస్తోన్న పెద్దన్న అమెరికాను ముచ్చెమటలు పోయిస్తున్న చిన్న దేశానికి నియంత కిమ్ జంగ్ ఉన్. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వ్యవహరశైలితో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.కిమ్‌కు మరో కోణం కూడ ఉంది. సంగీతమంటే కిమ్‌కు ప్రాణం. సంగీతమంటే మోజుతోనే ఆయన రీసోల్‌జూ‌ను వివాహం చేసుకొన్నాడని అంటున్నారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచదేశాలకు నియంతగా సుపరిచితుడు. కానీ, క్రీడలు, సంగీతమంటే కూడ కిమ్‌కు పిచ్చి అభిమానం. అంతేకాదు భోజనప్రియుడు కూడ కిమ్. తన భోజనంలో రుచికరమైన ఆహరపదార్థాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటారు.

కొవ్వును తగ్గించుకోవాలని వైద్యులు సూచించినా కానీ, తిండి విషయంలో మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు కిమ్ జంగ్ ఉన్. క్రీడలపై కూడ ఆసక్తి ఎక్కువే. అయితే ఓటమి అంటే మాత్రం కిమ్ తట్టుకోలేడు.

కిమ్‌ను చాలా పిరికివాడుగా చెబుతారు. తనపై ఎప్పుడు ఏ రకంగా దాడి జరుగుతోందోననే భయం కిమ్‌లో ఉంటుందంటారు. తన రక్షణ కోసం కిమ్ ఎప్పటికప్పుడూ జాగ్రత్తలు తీసుకొంటారని చెబుతుంటారు.

కిమ్ సంగీతమంటే ప్రాణం

కిమ్ సంగీతమంటే ప్రాణం

కిమ్‌లో మరో మనిషి ఉన్నాడు. సంగీతమంటే కిమ్ చెవి కోసుకుంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా ఫిడేలు వాయిస్తుంటాడు. మైఖేల్‌జాక్సన్‌ అంటే ప్రాణమిస్తాడు. రిసోల్‌జూతో పెళ్లి వెనుకా సంగీతమే ఉంది. కిమ్ సతీమణి రీసోల్‌జూ అమ్మాయి మంచి గాయని. ఆమె పాటనచ్చి ఆమెను వివాహం చేసుకొన్నాడంటారు. , తనదాన్ని చేసుకున్నాడట. కిమ్‌కు బాస్కెట్‌బాల్‌ అన్నా పిచ్చే. మైఖేల్‌జోర్డాన్‌కు వీరాభిమాని. రోజూ ఓ గంటైనా బాస్కెట్‌బాల్‌ ఆడతాడు. మహామహా ఆటగాళ్లకైనా ఏదో ఓ సమయంలో ఓటమి తప్పదు. నిజమైన క్రీడాకారుడు ఆ వైఫల్యాన్ని హుందాగా స్వీకరిస్తాడు కూడా. క్రీడాస్ఫూర్తి అంటే అదే! కిమ్‌కు మాత్రం ఓటమి అంటే పరమ అసహ్యం. తమ దేశం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఆటగాళ్లను ఎయిర్‌పోర్టులోనే, ‘ఖాళీ చేతులతో తిరిగొస్తే మాత్రం ఖేల్‌ ఖతమ్‌...' అని హెచ్చరించాడు. అంత ఒత్తిడిలో ఆటేం ఆడతారూ, పతకాలేం తెస్తారూ? బెదిరించినట్టుగానే, ఓడివచ్చిన వారిని బొగ్గుబావిలో వెట్టి కార్మికుల్ని చేశాడు.

కిమ్‌కు భయమెక్కువ

కిమ్‌కు భయమెక్కువ

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ మహాపిరికివాడు. నిద్రలోనూ ప్రాణభయమే! తనను గద్దె దించడానికి, అమెరికా నేతృత్వంలో కుట్రలూ కుతంత్రాలూ జరుగుతున్నాయని అనుమానిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం నిజంగానే హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచీ మృత్యుభీతి మరింత ముదిరింది. హఠాత్తుగా పళ్లెం ముందు నుంచీ లేచిపోతాడు, శత్రువులు ఆహారంలో విషం కలిపారేమో అన్న అనుమానం. ఉలిక్కిపడినట్టు నిద్రలోంచి మేల్కొంటాడు.సైన్యంలోని ప్రధాన అధికారుల మీద ఓ కన్నేసి ఉంచుతాడు. ఆరేళ్ల పాలనలో... ఆరేడుగురు రక్షణ మంత్రుల్ని మార్చేశాడు. అధికారం చేపట్టి ఇంతకాలం గడిచినా ఉత్తర కొరియా సరిహద్దులు దాటలేదు కిమ్‌. తన అధికారాన్ని ఎవరైనా లాగేసుకొంటారనేది కిమ్ భయం.

అమ్మాయిలతో రాసలీలల్లో

అమ్మాయిలతో రాసలీలల్లో

కిమ్ జంగ్ ఉన్ జీవనశైలి విలాసవంతంగా ఉంటుంది. ఉత్తరకొరియాలో సామాన్యుడి పరిస్థితి దుర్భరంగా ఉంటుందంటారు.కానీ కిమ్ మాత్రం విలాస పురుషుడు. . రాజభోగాలు అనుభవిస్తాడు. వందదాకా ఖరీదైన కార్లు ఉన్నాయని ప్రచారం. స్వర్గాన్ని తలపించే ఓ నౌక కూడా ఉందంటారు. అణుబాంబులంటే అధినేతకు మహా ఇష్టం. వాటి తయారీలో పాల్గొంటున్న శాస్త్రవేత్తలకు కోట్లకు కోట్లు నజరానాగా ప్రకటిస్తుంటాడు. అందమైన అమ్మాయిలతో రాసక్రీడల్లో మునిగితేలుతుంటారు. ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ ‘ప్లెజర్‌ స్క్వాడ్‌' సిద్ధంగా ఉంటుంది. అందులో అంతా అందమైన అమ్మాయిలను ఏరికోరి తీసుకువచ్చారనే ప్రచారం ఉంది.

అమెరికాతో వైరానికి కారణమిదే

అమెరికాతో వైరానికి కారణమిదే

అమెరికాతో ఉత్తర కొరియా శత్రుత్వం ఇప్పటిది కాదు. ప్రపంచయుద్ధాల ముందు నాటిది. కొన్ని దశాబ్దాల పాటు జపాన్‌ అధీనంలో ఉండేది కొరియా. ఆ సమయంలో... సాంస్కృతికంగా, ఆర్థికంగా, మతపరంగా అనేక హింసలు అనుభవించారు కొరియా ప్రజలు. ఇక్కడి నుంచి అపురూప సంపదల్ని జపాన్‌కు తరలించుకు వెళ్లారు. కొరియన్‌ సంస్కృతిని ప్రతిబింబించే పేర్లనూ మార్చుకోమంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓటమి తర్వాత...ఉత్తర కొరియా రష్యా ఛత్రం కిందికి, దక్షిణ కొరియా అమెరికా నీడలోకి వెళ్లిపోయాయి. అదే అదనుగా అమెరికా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. పోరాటయోధుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ నాయకత్వంలో ఉత్తర కొరియా... దాయాది మీద యుద్ధం ప్రకటించింది. ఆ దాడికి చైనా, రష్యాలు మద్దతు పలికాయి. అటువైపు నుంచీ, దక్షిణ కొరియా మిత్రదేశంగా అమెరికా రంగంలోకి దిగింది. ఆ పోరాటంలో పదిలక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. అపార విధ్వంసం జరిగింది. ఆ యుద్ధాన్ని సామ్రాజ్యవాదంపై పోరాటంగా అభివర్ణించుకుంటారు జనం. అమెరికా పట్ల వ్యతిరేకత అప్పటి నుంచీ ఉందక్కడ. ఆ తర్వాత, సంగ్‌ తనయుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ అధికారంలోకి వచ్చాడు. కిమ్ జోంగ్ ఇల్ తనయుడు కిమ్ జంగ్ ఉన్ . కిమ్ జోంగ్ ఇల్ చనిపోయిన తర్వాత కిమ్ జంగ్ ఉన్ అధికారాన్ని చేపట్టారు.

ఎదిరిస్తే ప్రాణాలుండవు

ఎదిరిస్తే ప్రాణాలుండవు

ఉత్తర కొరియాలో శాంతికి భద్రత లేదు. ఏకపార్టీ వ్యవస్థ కావడంతో నిరసన గళాలకు ఆస్కారమే లేదు. ఎవరైనా తెగించి మాట్లాడితే తల తెగిపోవడం ఖాయం. సైన్యం చెప్పిందే శాసనం. రాజు చేసిందే పాలన. ఆడపిల్లలకు రక్షణే లేదు. ఏ అమ్మాయి అయినా కంటికి కాస్త నదురుగా కనబడితే చాలు... ఎత్తుకొచ్చి సెక్స్‌ బానిసలుగా మార్చేస్తారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే... నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేస్తారు.కిమ్‌ రక్తపిపాసి. అడ్డొచ్చినవారినీ, అడ్డొస్తారని అనుమానించినవారినీ... అడ్డంగా నరికేసిన సందర్భాలు అనేకం. శత్రువులకు చావు ఏ రూపంలో అయినా ఎదురుపడవచ్చు. హఠాత్తుగా బుల్లెట్ల వర్షం కురవవచ్చు.

కిమ్ అధికారపీఠం ఎలా దక్కిందంటే?

కిమ్ అధికారపీఠం ఎలా దక్కిందంటే?

తండ్రి హఠాన్మరణం తర్వాత కిమ్‌ అధికార పీఠాన్ని ఎక్కారు. పాలన మీద అవగాహన లేదు. పార్టీ మీద పట్టు అంతంతమాత్రమే. సైన్యం గుట్టుమట్లూ తెలియవు. అయినా సరే, సవతి సోదరుడిని పక్కనపెట్టి తానే పీఠం ఎక్కాడు.పార్టీ అధినేతగా, దేశ అధ్యక్షుడిగా, సర్వసైన్యాధిపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ పిల్లకాకిని చూసి సైనికాధికారులు తోకజాడించడం మొదలుపెట్టారు. పార్టీలో అసమ్మతి పెరిగింది. పాలన అస్తవ్యస్తమైపోయింది. ఆ సంక్షోభ సమయంలో ఓ బలమైన ఆసరా అవసరమైంది కిమ్‌కు. తండ్రి హయాంలో ముఖ్యపాత్ర పోషించిన మేనత్త మొగుడి సాయం తీసుకున్నాడు. అయితే కిమ్ మామ ప్రభుత్వంలో కీలకంగా మారారు. దీంతో కిమ్ తన విశ్వరూపం చూపాడు. మామ మీద కేసులు బనాయించాడు. కొద్దిరోజులకే ఆ కుటుంబం కనిపించకుండా పోయింది. ఏదో ఒకరోజు నామ్‌ తనకు పోటీవస్తాడన్న భయం కిమ్‌ను వెంటాడేది. ‘విష ప్రయోగం' కారణంగా నామ్‌ ప్రాణాలు కోల్పోయినట్టు పోస్టుమార్టమ్‌ రిపోర్టు చెబుతోంది. ఆ విషపు ఆలోచన ఎవరిదన్నది బహిరంగ రహస్యం.

విద్య, వైద్యానికి పెద్దపీట

విద్య, వైద్యానికి పెద్దపీట

కిమ్‌ విద్యకు, వైద్యానికీ చాలా ప్రాధాన్యం ఇస్తాడు. ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితం. సర్కారీ దవాఖానాలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్ని తలపించేలా ఉంటాయి. అదే సమయంలో సంప్రదాయ కొరియన్‌ వైద్యాన్ని కూడా ప్రోత్సహిస్తోందా దేశం. పేద దేశమైనా ఉత్తర కొరియా జీవన ప్రమాణం... డెబ్బయ్యేళ్ల పైచిలుకుగా ఉంది. ‘వర్దమాన దేశాలకు ఉత్తరకొరియా వైద్య విధానం ఓ పాఠం' అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థే కితాబు ఇచ్చింది. విద్యకూ అంతే విలువ ఇస్తాడు కిమ్‌. పాఠ్యపుస్తకాల్లో అక్కడక్కడా పాలకుల స్తోత్రపాఠాలు ఉన్నా... మానవ సంబంధాలు, జీవన నైపుణ్యం, విలువలు మొదలైన విషయాలకు స్థానం ఇచ్చారు. ప్రతి బడికీ ఆటమైదానం తప్పనిసరి. ఆర్థిక సంక్షోభంలోనూ బడ్జెట్‌ కేటాయింపుల్లో రాజీ ఉండదు.

English summary
Kim Jong-un, 33, leader of North Korea, is rather secretive about his love life - however, North Korean state media did officially identify a woman as his wife five years ago.The country’s media described the petite woman who appeared smiling in official photographs as “his wife, Comrade Ri Sol-ju” in 2012.She was initially thought to be Hyon Song-wol, a singer in a North Korean musical group. This identification was made by South Korean intelligence, but soon after North Korean state media stated the woman was the leader’s wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X