• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

30న ఉరిశిక్ష: ఎవరీ యాకుబ్ మెమన్?

By Nageswara Rao
|

ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ సుప్రీం కోర్టు మరణ శిక్ష అమలును మరోమారు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టేసింది. దీంతో జులై 30వ తేదీన యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

విశేషం ఏమిటంటే అదేరోజున యాకుబ్ మెమన్ (53) పుట్టినరోజు కావడం గమనార్హం. ఉరిశిక్ష అమలుతో దేశవ్యాప్త చర్చకు తెరలేపాడు ఈ యాకుబ్ మెమన్. ఇంతకీ ఎవరీ యాకుబ్ ఉమెన్. ఇతను చేసిన నేరం ఏంటో ఒక్కసారి చూద్దాం.

Who is Yakub Memon: Did the 1993 Mumbai blasts convict pay for being Tiger's brother?

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన టైగర్ మెమన్ సోదరుడే యాకుబ్ మెమన్. ఉన్నత చదువును అభ్యసించిన యాకుబ్ వృత్తిరీత్యా చార్టర్డ్ ఆకౌంట్. దావుద్ ఇబ్రహీం, అన్న టైగర్ మెమన్‌లకు డబ్బులు సమకూర్చేవాడు. దీంతో పాటు 1993 ముంబై వరుస పేలుళ్ల కోసం సొంత వాహనాలను వారికి ఇచ్చాడు.

ముంబైలో వరుస పేలుళ్లు జరిగిన తర్వాత యాకుబ్ మెమన్ భారతదేశం వదిలి వెల్లిపోయాడు. పాకిస్ధాన్‌లో తలదాచుకున్నాడు. మెమన్‌ను సీబీఐ అధికారులు 1994లో అరెస్టు చేశారు. అయితే యాకుబ్ మెమన్ అరెస్టులో అప్పట్లో భిన్నవాదనలు వినిపించాయి. 1994లో అతడిని నేపాల్‌లో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెబుతుండగా... అతనే లొంగిపోయాడని అతని తరపున్యాయవాదులు వాదించారు.

Who is Yakub Memon: Did the 1993 Mumbai blasts convict pay for being Tiger's brother?

1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు.. ఈ కేసులో టైగర్‌ మెమన్‌ (యాకూబ్‌ సోదరుడు), దావూద్‌ ఇబ్రహీం పేలుళ్లలో ప్రధాన సూత్రధారులు. చార్టర్డ్‌ అకౌంట్‌ అయిన మెమన్‌ స్వయంగా ముంబై పేలుళ్ల కుట్రలో పాలు పంచుకున్నాడని అభియోగాలు రుజువయ్యాయి.

దీంతో 2007లో ముంబైలోని టాడా కోర్టు మెమన్‌తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది. యాకుబ్ మెమన్ ఉరిశిక్షపై రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నిరాకరించారు. దీంతో చివరగా యాకూబ్‌ మెమన్‌ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిని చీఫ్‌జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది.

Who is Yakub Memon: Did the 1993 Mumbai blasts convict pay for being Tiger's brother?

ప్రస్తుతం యాకుబ్ మెమన్ నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. అతడికి అక్కడే ఉరిశిక్షను అమలు చేసే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే, 257 మంది ప్రాణాలను బలిగొన్న ముంబై వరుస పేలుళ్ల కేసులో తొలి ఉరి యాకుబ్ మెమన్‌దే అవుతుంది. మెమన్‌‌కు ఉరితీత ఖాయం కావటంతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని... అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

ఇదే కేసులో అక్రమ ఆయుధాలు కలిగినట్లు నిరూపణ కావటంతో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ సైతం ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Who is Yakub Memon: Did the 1993 Mumbai blasts convict pay for being Tiger's brother?

1993 ముంబై వరుస పేలుళ్ల సంఘటనకు సంబంధించిన టైమ్‌లైన్:

1993 మార్చి 12: నిమిషాల వ్యవధిలోనే ముంబైలో 13 వరుస పేలుళ్లు. 257 మంది మృతి.

2006 సెప్టెంబర్‌ 12: తీర్పును వెల్లడించిన ముంబైలోని టాడా కోర్టు. 12 మందికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ ఖైదు ఖరారు.

2013 మార్చి 21: యాకూబ్‌ మెమన్‌, టైగర్‌ మెమన్‌ల ఉరిశిక్షలను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు. పది మందికి శిక్షలను యావజ్జీవంగా మార్పు.

2014 మే: యాకుబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌.

2014 జూన్‌ 2: క్షమాభిక్ష పిటిషన్లను ఓపెన్‌ కోర్టులోనే విచారణ జరపాలన్న నిబంధన మేరకు, ఉరిశిక్షను నిలిపివేసిన అత్యున్నత న్యాయస్ధానం.

2015 ఏప్రిల్‌ 9: మరణశిక్షపై యాకూబ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.

2015 జూలై 21: క్యూరిటివ్‌ పిటిషన్‌ తొసిపుచ్చిన సుప్రీం కోర్టు. జులై 30న ఉరిశిక్ష.

English summary
Few of the 100 persons convicted in the 1993 serial blasts case reacted like Yakub Memon when he heard the verdict of the trial court. Often mildly contemptuous but always well mannered in court, the younger brother of the prime accused in the case Tiger Memon, exploded when he heard the death sentence shouting at the judge, “Oh Lord, forgive this man for he knows not what he does.”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X