అసంబద్దత.. అప్రస్తుతం: పవన్ ఎందుకలా మాట్లాడాడు?.. కొత్తగా చెప్పిందేంటి?
హైదరాబాద్: తొలిరోజు జేఎఫ్‌సి(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ)
సరైన మార్గంలోనే వెళ్తుందా?.. లేక చాలామంది విమర్శిస్తున్నట్టు కేవలం కాలయాపన కోసమే దీన్ని తెర పైకి తీసుకొచ్చారా?.. అసలు దీని ఎజెండా ఏంటి?..
Recommended Video

ఏపీ ప్రయోజనాలను కాపాడుకోవడమైతే.. ఆ సంగతి వదిలేసి జనసేనాని.. 'వేర్పాటువాదం, దేశం విచ్చిన్నం, దేశ సమగ్రతకు ముప్పు, తిరుగుబాటు..' అంటూ ఏదేదో కలవరించడమేంటి?. అసలు నిన్నటి సమావేశంలో పవన్ నోటి నుంచి ఒక నిర్మాణాత్మకమైన సూచన గానీ సలహా గానీ ఏమి వినిపించలేదు. ఎంతసేపూ.. దేశం ముక్కలవుతుందని చెప్పడమే ఆయన ఉద్దేశంగా కనిపించింది.

అసంబద్దంగా..:
ఇటీవలి కాలంలో పవన్ నోటి నుంచి ఎప్పుడు విన్నా.. ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఆయన స్పీచుల్లో 'తిరుగుబాటు, దేశ సమగ్రత, అంతర్యుద్దాలు, వేర్పాటు వాదాలు' లాంటి పదాలు పదేపదే రిపీట్ అయిపోతున్నాయి. నిన్నటి సమావేశంలోనూ అదే జరిగింది. ఓవైపు రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే.. ఏం చేయాలో.. ఏం చేస్తే బాగుంటుందో చెప్పడం పక్కనపెట్టి.. దేశానికి ఏదో అయిపోతుందని ఆయన మాట్లాడటం అసంబద్దంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పవన్ ఏమన్నారు?:
'చట్టాలను గౌరవించనపుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పట్టించుకోకపోతే దేశభద్రతకు ముప్పు గా పరిణమిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వచ్చే తరంపై పడుతుంది. వాళ్లంతా తిరుగుబాటు చేయాలనుకుంటే అది ఎటువైపు వెళ్తుందో!
ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో తమను ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తున్నారనే అభిప్రాయానికి ప్రజలు వస్తారు. ఉత్తర, దక్షిణ భారతంగా దేశాన్ని విడగొట్టాలనే వేర్పాటువాదంవైపు బలమైన దారులు పడతాయి'.. ఇవీ నిన్నటి సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు.

అప్రస్తుత ప్రస్తావనలు..:
'కొన్నేళ్ల క్రితం తెలంగాణకు వచ్చి స్థిరపడిన కుటుంబంలో ఒకరు చనిపోతే అంత్యక్రియలు చేయనివ్వలేదు. తూర్పు ఆంధ్ర నుంచి వచ్చి టీచర్లుగా పనిచేస్తున్న వాళ్లను తిరిగి అక్కడికే వెళ్లిపోవాలంటున్నారు'.. పవన్ ప్రస్తావించిన ఈ విషయాలు కూడా అప్రస్తుతం అనే అనిపించాయి. సమావేశంలో ఉన్న మేదావులు, వివిధ రంగాల నిపుణులు తమవంతు అభిప్రాయంగా విలువైన సూచనలిస్తే.. పవన్ మాత్రం పస లేని అంశాలనే ఎక్కువగా ప్రస్తావించారు.

పవన్ ఎటువైపు:
పవన్ కల్యాణ్ సంగతి పక్కనపెడితే.. నిన్నటి సమావేశంలో దాదాపు అందరూ మేదావులు పోరాటమే ప్రధానం అని ముక్త కంఠంతో చెప్పారు. అధ్యయనం తర్వాత పోరాటమేంటి?.. లెక్కలన్ని పక్కాగా కనిపిస్తూనే ఉన్నాయని అన్నారు.
కాబట్టి రెండు ఏకకాలంలో జరిగితేనే ఏపీకి ఎంతో కొంత ప్రయోజనం దక్కుతుందన్నారు. పవన్ మాత్రం అధ్యయనం-పోరాటం సంగతి తప్ప మిగతావేవో మాట్లాడేశారు. పోరాట పంథానే ఎంచుకుంటారా?.. లేక అధ్యయనంలోనే కాలం వెళ్లదీస్తారా? అన్నది ఇక ఆయనకే తెలియాలి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications