Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్కటౌతారా: టిఆర్ఎస్ వ్యాఖ్య, జగన్‌కు కాంగ్రెస్ అండ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విపక్షాలు ఏకతాటి పైకి వస్తున్నాయా? అంటే అవుననే చెప్పవచ్చు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యల పైన కెసిఆర్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ తెలంగాణలో విపక్షాలు ఏకమయ్యాయి. రెండు రోజుల క్రితం ఒక్కటై బంద్‌ను విజయవంతం చేశాయి.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో విపక్షాలు ఒక్కటి కాగా, ఏపీలో ప్రత్యేక హోదా కోసం ఒక్కటవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ. ఈ నేపథ్యంలో దానిని వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీకీ ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలనే డిమాండుతో జగన్ గుంటూరు జిల్లా నల్లపాడులో నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష సోమవారంతో ఆరో రోజుకు చేరింది.

ఆయన ప్రత్యేక హోదా డిమాండుకు పలువురు మద్దతు పలుకుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపికి మద్దతు పలికిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ... ఇటీవల జగన్‌ను దీక్షా ప్రాంగణంలో కలిసి మద్దతు పలికారు.

సిపిఎం మధు కూడా తమ పార్టీ... ప్రత్యేక హోదా సాధించే వరకు వైసిపి వెంట ఉంటుందని ప్రకటించారు. తాజాగా, ఉప్పు - నిప్పులా భావించే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ దీక్షను సమర్థించాయి. కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా పైన చంద్రబాబును ఏకిపారేశారు. రాజధాని శంకుస్థాపనకు ఇంత ఆర్భాటం అవసరమా అని ప్రశ్నించారు. అదే సమయంలో హోదా కోసం దీక్ష చేస్తున్న జగన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హోదా కోసం కాంగ్రెస్, వైసిపి, వామపక్షాలు ఒక్కటయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

Will Congress, YSRCP fight together for Special Status to AP?

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య పైన విపక్షాలు కూడా ఇలాగే ఏకమయ్యాయి. తెలంగాణ టిడిపి యువనేత రేవంత్ రెడ్డి ముందుగానే దీనిని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వ రైతు వ్యతిరేక పాలన విపక్షాలను ఏకం చేస్తోందన్నారు. కాంగ్రెస్, వైసిపి, బిజెపి, వామపక్ష నేతలు కూడా అదే చెప్పారు.

ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితం టిఆర్ఎస్ నేత ఒకరు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఏపీలో రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదా, ఆశా వర్కర్ల సమస్యలు లెఫ్ట్ పార్టీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

తెలంగాణలో విపక్షాలన్నీ ఒక్కటి కావడంపై మాట్లాడుతూ... ఏపీ కాంగ్రెస్ టిడిపిలో విలీనమైందా అని ఘాటుగా ప్రశ్నించారు. అయితే, ఇప్పుడు జగన్ దీక్షను ఏపీ కాంగ్రెస్ సమర్థించడం, వామపక్షాలు కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. రైతు ఆత్మహత్యల పైన తెలంగాణలో విపక్షాలు ఏకమైనట్లే, హోదా కోసం ఏపీలోను విపక్షాలు ఏకతాటిపైకి రావొచ్చంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+