తెలంగాణ: జయప్రద, పురంధేశ్వరిలకు లైన్ క్లియర్

దీంతో ఉండవల్లి పైన పార్టీ అధిష్టానం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చే అంశం కూడా అనుమానంగా ఉందంటున్నారు. అంతేకాకుండా ఉండవల్లి కూడా ప్రత్యక్ష రాజకీయల నుండి తప్పుకుంటారనే ప్రచారం సాగుతోంది.
ఉండవల్లి సిడబ్ల్యూసి తీర్మానం తర్వాత లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. యూపిఏపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఉద్దేశ్యంతో ఇటీవల రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఉండవల్లితో పాటు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వారిపై వేటు వేసేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఉండవల్లి త్వరలో కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఉండవల్లికి అధిష్టానం టిక్కెట్ నిరాకరించినా, ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నా జయప్రదకు లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. 2014 నాటికి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని జయప్రద ఉబలాటపడుతున్నారు. రాజమండ్రి నుండి పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. రాజమండ్రి కోసం ఆమె టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలతో అప్పుడు సంప్రదింపులు జరిపినట్లుగా కూడా ప్రచారం జరిగింది.
వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలలో అప్పటికే రాజమండ్రి నుండి అభ్యర్థులు ఉన్నారు. దీంతో వారి నుండి ఎలాంటి హామీ రాలేదు. ఆ తర్వాత ఆమె సోనియా గాంధీని కలిశారు. దీంతో రాజమండ్రి పైన హామీ వచ్చిందా అనే చర్చ సాగింది. అయితే ఇప్పుడు ఉండవల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఆయన స్థానంలో స్థానంలో జయప్రదను బరిలోకి దింపేందుకు అధిష్టానం కూడా సిద్ధమవుతోందంటున్నారు.
మరోవైపు విజయవాడ పార్లమెంటు స్థానం విషయంలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి కూడా లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోందంటున్నారు. పురంధేశ్వరి కొన్నాళ్లుగా విజయవాడను రాజధానిగా చేసేందుకు లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. విశాఖ నుండి టిఎస్సార్ పోటీకి సిద్దంగా ఉండటంతో పురంధేశ్వరి విజయవాడపై దృష్టి పెట్టారు. లగడపాటి కూడా తిరుగుబావుటా ఎగురవేయడంతో పురంధేశ్వరికి లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications