Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హిందూ అబ్బాయితో ప్రేమలో పడ్డా - "ఫరియా అబ్దుల్లా "

తెలుగు చిత్ర పరిశ్రమలో తన గ్లామర్, నటనతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ "ఫరియా అబ్దుల్లా". జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫరియాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలానే గతేడాది ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.

ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో ఓ సాంగ్‌లో కూడా కనిపించి ఆకట్టుకుంది. అంతే కాకుండా మత్తు వదలరా 2 మూవీలో నటనకు గాను రీసెంట్ గానే 'గద్దర్ ఫిల్మ్ అవార్డు' సైతం గెలుచుకుంది. రీసెంట్ గానే 'గుర్రం పాపిరెడ్డి', 'అనగనగా ఒకరోజు' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగానే కాకుండా 'మత్తు వదలరా 2', 'గుర్రం పాపిరెడ్డి' సినిమాల్లో ర్యాప్ పాటలు పాడి తనలోని మరో కోణాన్ని కూడా ప్రదర్శించారు. రీసెంట్ గానే ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియా అబ్దుల్లా తన రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. దీంతో ఈ వ్యవహాయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

faria-abdullah-opens-about-her-relationship-with-hindu-boy

ఆమె మాట్లాడుతూ .. ప్రస్తుతం నేను లవ్‌లో ఉన్నాను. అఫైర్‌ కారణంగా నా పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్‌గా ఉంచుకోగలగుతున్నాను. ప్రస్తుతం నా లైఫ్‌కు అదే ప్రయారిటీ. అయితే నేను ముస్లిం అబ్బాయితో కాకుండా హిందూ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. అతడు నాకు బాల్య స్నేహితుడు కాదు. ఇండస్ట్రీకి చెందిన వారే.

నేను ప్రేమిస్తున్న వ్యక్తి కొరియోగ్రాఫర్. మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. మ్యూజిక్, డ్యాన్స్, ర్యాప్‌లో రాణిస్తున్నానంటే.. అందుకు కారణం ఆయనే. ఆయన అందించే ప్రోత్సాహం వల్లే అంటూ తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన ఫరియా, ముస్లిం కుటుంబంలో జన్మించి ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. దీంతో ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమించడం అంటూ పలువురు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రేమకు కుల,మత తారతమ్యాలు ఉండవంటూ సపోర్ట్ గా నిలుస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+