బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. హిట్ ప్లాఫ్ లతో సంబంధాలు లేకుండా సినిమాలు చేస్తున్నారు. గతేడాది అఖండ 2 తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. బాలయ్య- గోపిచంద్ మలినేని కాంబినేషన్ అంటే వీరసింహారెడ్డి సినిమానే గుర్తుకొస్తుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ తాజా అప్డేట్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతోంది. ఈ మూవీలో బోల్డ్ బ్యూటీ లక్ష్మీ రాయ్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయలేదు. ఇక గతంలో లక్ష్మీరాయ్ బాలయ్య సరసన అధినాయకుడు సినిమాలో నటించింది. అయితే మళ్లీ చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటం విశేషం.

LakshmiRai to Play Pivotal Role in Nandamuri Balakrishna and Gopichand Malineni Film Tollywood news

ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఆమె ఎంట్రీతో స్టోరీకి టర్నింగ్ పాయింట్ అని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య- గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక హిస్టారికల్ మూవీని సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+