దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ??

ప్రముఖ ఛానల్ వేదికగా ప్రసారం అవుతున్న బిబి జోడీ సీజన్ 2 కార్యక్రమం ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాగా గ్రాండ్ ఫినాలే దశకు చేరుకున్న ఈ షో ఈ వారంతో ముగియనుంది. గత కొన్ని వారాలుగా ఉత్కంఠగా సాగిన ఈ పోటీలో ఐదు జంటలు తుది పోరుకు చేరుకున్నాయి. మానస్-శ్రష్టి, అమర్-నైనిక, విశ్వ-నేహా, శ్రీసత్య-అర్జున్ కళ్యాణ్, ధన్‌రాజ్-భానుశ్రీ విజేత టైటిల్ కోసం బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే ప్రతి జంట తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

అయితే ఫినాలేకు సంబంధించిన రెండు ప్రోమోలు ఇప్పటికే విడుదల కాగా, తాజాగా మరో ప్రోమో వచ్చింది. మొదటి ప్రోమోలో మానస్-శ్రష్టి వర్మ, రెండో ప్రోమోలో అమర్-నైనిక అద్భుత ప్రదర్శనలను చూపించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో విశ్వ-నేహా జోడీ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. వారు "మేము మీకు ఎదురొచ్చినా మీకే రిస్క్.. మీరు మాకు ఎదురొచ్చినా మీకే రిస్క్.. కప్పు కొట్టుకెళ్లిపోతాం.." అంటూ పూర్తి ఆత్మవిశ్వాసంతో స్టేజ్‌పైకి వచ్చారు. శంభో శివ శంభో సినిమాలోని టైటిల్ సాంగ్‌కి విశ్వ-నేహా జంట ఇచ్చిన ప్రదర్శన వీక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది.

bb-jodi-season-2-dance-show-grand-finale-perfomance-and-winners-speculations-in-social-media

దీంతో వారికి జడ్జి శ్రీదేవి విజయ్ కుమార్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. "ఇదీ ఫినాలే పెర్ఫామెన్స్ అంటే.. ప్రాణం పెట్టి చేస్తారు ఫినాలే స్టేజ్ మీద అని చాలా మంది చెప్తారు కానీ మీరు ఇవాళ ప్రూ చేశారు అది.." అని ఆమె ప్రశంసించారు. జడ్జి సదా కూడా వారి ప్రదర్శన పట్ల ముగ్ధులై "ఫినాలే అంటే ఏంటనేది మీరు చూపించారు" అంటూ నమస్కరించారు. శేఖర్ మాస్టర్ అయితే "స్టేజ్ బద్దలు కొడదామని వచ్చారు ఫినాలేకి స్టేజ్ బద్దలు కొట్టారు.. ఇది కదయ్యా ఫైనల్.. ఇది కదయ్యా గ్రాండ్ ఫినాలే అంటే.." అంటూ విపరీతంగా అభినందించారు. తమతో కలిసి డ్యాన్స్ చేసిన బాయ్స్ అందరికీ విశ్వ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

విజేత - రన్నరప్ ఎవరంటే..?

ఇక గత వారమే ఫినాలే షూటింగ్ పూర్తవడంతో, షో విజేత, రన్నరప్ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. మొదటి నుంచి తమ ప్రతి ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మానస్-శ్రష్టి వర్మ టైటిల్‌ను గెలుచుకున్నట్లు సమాచారం. వారికి గట్టి పోటీనిచ్చి, ఎంతో కష్టపడ్డ నేహా-విశ్వ జోడీ రన్నరప్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఇక మరో విజయవంతమైన జంట అమర్-నైనిక మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. శ్రష్టి కొరియోగ్రాఫర్ కావడం, మానస్ అద్భుతమైన డ్యాన్సర్ కావడంతో, ఈ జంట మొదటి నుంచీ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా నిలిచింది. నేహా-విశ్వ, అమర్-నైనిక కూడా టైటిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి వారు రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+