సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! (వీడియో)

సినీ ప్రముఖులు ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లు వారిని వెంబడిస్తూనే ఉంటాయి. ఎయిర్పోర్టులు, జిమ్‌లు లేదా బ్రాండ్ ఈవెంట్స్ ఎక్కడైనా సరే పాపరాజీలు వారిని చుట్టుముట్టడం మనం చూస్తూనే ఉంటాయి. అయితే ఇదంతా సహజంగా జరుగుతుందా? లేక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుందా? అనే సందేహాలకు బలం చేకూర్చేలా సమంతకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సెలబ్రిటీల పబ్లిసిటీ స్టంట్స్, పీఆర్ మేనేజ్మెంట్ వెనుక ఉండే రహస్యాలను ఈ వీడియో బట్టబయలు చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారా?
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ప్రత్యక్షమైన ఈ వీడియోకు.." పీఆర్ మేనేజర్ పొరపాటున అసలు రహస్యం చెప్పేశారు.."అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో సమంత ఓ బ్రాండ్ ఈవెంట్‌కు హాజరవుతూ తన కారు దిగడం కనిపిస్తుంది. ఆమె ఎప్పటిలాగే చిరునవ్వుతో కెమెరాలకు ఫోజులిచ్చారు. కానీ ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన సమంత కాదు.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన ఓ గొంతు. ఆమె పీఆర్ మేనేజర్ అని భావిస్తున్న ఓ వ్యక్తి అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి ఇలా అన్నారు. "గాయ్స్.. మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన ఉద్దేశం ఇదే అయితే.. ఇకపై నా ఈవెంట్స్‌కు మిమ్మల్ని అస్సలు పిలవను" అని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్లు హద్దులు దాటి ప్రవర్తించడంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

Samantha Viral Video PR Secret Exposed Truth Behind Celebrity Paparazzi Sightings Revealed

బయటపడిన పబ్లిసిటీ సంస్కృతి
సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా ఫోటోగ్రాఫర్లు వాటంతట వారే వస్తారని చాలా మంది భావిస్తారు. కానీ ఈ వీడియోతో ఆ పబ్లిసిటీ వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. సెలబ్రిటీల టీమ్స్ స్వయంగా ఫోటోగ్రాఫర్లను పిలిచి, వారు ఎక్కడికి వస్తున్నారో సమాచారం ఇస్తారు.ఇలా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ద్వారా సదరు సెలబ్రిటీకి లేదా వారు ప్రమోట్ చేసే బ్రాండ్‌కు భారీగా పబ్లిసిటీ లభిస్తుంది. నిరంతరం వార్తల్లో ఉండటం కోసం సెలబ్రిటీలు అనుసరించే ఒక వ్యూహం ఇది.

నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు "మొత్తానికి పీఆర్ గుట్టు రట్టయింది" అని కొందరు వ్యంగ్యంగా కామెంట్ చూస్తుంటే.. మరికొందరు మాత్రం పీఆర్ మేనేజర్‌కు మద్దతు తెలుపుతున్నారు. "మేము పిలిచాం కదా అని ఫోటోగ్రాఫర్లు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకోనక్కర్లేదు, వారికి కూడా కొన్ని హద్దులు ఉండాలి" అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, గ్లామర్ ప్రపంచంలో కనిపించేవన్నీ సహజంగా జరిగినవి కావని, ప్రతి చిన్న మూమెంట్ వెనుక ఒక పెద్ద పీఆర్ టీమ్ కష్టం ఉంటుందని ఈ వీడియో మరోసారి నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+