హీరోయిన్ల సీక్రెట్ లీక్ చేసిన రాజాసాబ్ బ్యూటీ: నెట్టింట మొదలైన యుద్ధం!
దక్షిణాది ప్రముఖ నటి మాళవిక మోహనన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఇది ఆమె సినిమా విజయాల వల్ల కాదు.. తోటి హీరోయిన్లపై ఆమె చేసిన వివాదాస్పద కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె హీరోయిన్ల డైలాగ్ డెలివరీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
అసలు మాళవిక ఏమన్నారంటే?
ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్'లో నటించిన మాళవిక.. ఓ ఇంటర్వ్యూలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని కొంతమంది హీరోయిన్ల పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "చాలా మంది హీరోయిన్లు తమ డైలాగ్స్ నేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. షూటింగ్ సమయంలో కేవలం 1, 2, 3, 4 లేదా A, B, C, D అని అంకెలు, అక్షరాలు బుదబుదలాడుతూ మేనేజ్ చేస్తారు. డబ్బింగ్‌లో ఎలాగో లిప్ సింక్ సరిచేస్తారు కదా అనే ధీమా వారిది" అని ఆమె విమర్శించారు. కొంతమంది హీరోయిన్లు తమ కెరీర్ మొత్తం ఇలాగే నెట్టుకొస్తున్నారని, కేవలం రొటీన్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కాలం గడిపేస్తున్నారని ఎద్దేవా చేశారు.

నెటిజన్ల కౌంటర్: "నీ సంగతేంటి మాళవిక?"
మాళవిక కామెంట్స్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. నెటిజన్లు ఆమెకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. : "విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాలో నీ నటన చూసి అందరూ ఎక్స్‌ప్రెషన్స్ లేవని ట్రోల్ చేశారు. ఇప్పుడు నువ్వు ఇతరుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని ఓ నెటిజన్ విమర్శించారు."ఇతరులకు చెప్పే ముందు ఆ సలహా నీకు నువ్వు ఇచ్చుకుంటే బాగుంటుంది. పక్కవారిపై కామెంట్స్ చేసే బదులు నీ నటన మెరుగుపరుచుకో" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సంక్రాంతికి విడుదలైన 'ది రాజా సాబ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, ఆమెకు హిట్లు లేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని కొందరు అంటున్నారు.
మద్దతుగా నిలుస్తున్న ఫ్యాన్స్
అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం మాళవికకు మద్దతు ఇస్తున్నారు. 'బియాండ్ ద క్లౌడ్స్', 'తంగలాన్' వంటి సినిమాల్లో ఆమె అద్భుతంగా నటించిందని, ఆమె చెప్పిన మాటల్లో నిజం ఉందని సమర్థిస్తున్నారు. డైలాగ్స్ సరిగ్గా చెప్పని నటీమణులను విమర్శించడంలో తప్పులేదని వారు వాదిస్తున్నారు. మాళవిక ఇలా ట్రోలింగ్‌కు గురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓ నెటిజన్ "మీరు యాక్టింగ్ క్లాసులకు ఎప్పుడు వెళ్తారు?" అని అడిగినప్పుడు.. "నువ్వు ఫేమస్ అయిన రోజున నేను వెళ్తాను" అని ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
ఈ చెరువు చిత్రంలో దాగివున్న సీతాకోకచిలుకను కనిపెట్టగలరా? -
విమానంలో నటికి చేదు అనుభవం.. ప్రయాణీకుడి వికృత చేష్టలు! వీడియో -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’











Click it and Unblock the Notifications