ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!

ప్రతి మధ్యతరగతి ఇంట్లో అప్పు అనేది ఒక విడదీయలేని భాగం. ఆ అప్పుల వల్ల కుటుంబ సంబంధాలు ఎలా మారుతాయి? తీసుకునే నిర్ణయాలు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు రామ్ చక్రి. విలక్షణ నటుడు సముద్రఖని, టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ద్విభాషా చిత్రం 'కార్మేని సెల్వం'. ఏప్రిల్ 3న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకుడు పంచుకున్న విశేషాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

శేఖర్ కమ్ముల నా గురువు..
దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నేను తెలుగులో చూసిన మొదటి సినిమా 'ఆర్య'. ఆ తర్వాత 'ఆనంద్', 'గోదావరి' చిత్రాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. కమర్షియల్ సినిమాలను ఎంతగా ఆదరిస్తారో, శేఖర్ కమ్ముల సినిమాల్లాంటి రియలిస్టిక్ కథలను కూడా తెలుగు ప్రేక్షకులు అంతే గొప్పగా ప్రేమిస్తారు. శేఖర్ కమ్ములతో నేరుగా పనిచేయకపోయినా, ఆయన సినిమాలను చూస్తూ ఎంతో నేర్చుకున్నాను. ఆయనే నా మానసిక గురువు అని పేర్కొన్నారు. అలాగే తన దర్శక గురువు కె.వి. గుహన్‌కి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Samuthirakani Karmeni Selvam to Release on April 3rd Here What the Director Says

సముద్రఖని నటన.. అప్పుల బాధకు ఓ పరిష్కారం
మధ్యతరగతి భర్తగా, తండ్రిగా సముద్రఖని ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారని రామ్ చక్రి కొనియాడారు. ఈ సినిమా కేవలం ఒక కథ మాత్రమే కాదు, అప్పుల సమస్యతో సతమతమవుతున్న వారికి ఒక ధైర్యాన్నిచ్చే ప్రయత్నం. అప్పులు ఉన్నంత మాత్రాన జీవితం అయిపోలేదని, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమాలో చాలా రియలిస్టిక్‌గా చూపించాం. సముద్రఖని, గౌతమ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయల పాత్రలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి, అని ధీమా వ్యక్తం చేశారు.

సంగీతంలో సరికొత్త ప్రయోగం
ఈ సినిమా ద్వారా సంగీత ప్రపంచంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ టీమ్ మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ లేదా సింగర్లకే కాకుండా, ఆ పాట వెనుక పనిచేసిన ఇన్‌స్ట్రుమెంటలిస్టులు, సౌండ్ ఇంజినీర్లు వంటి టెక్నీషియన్లకు కూడా గుర్తింపు , రెవెన్యూ షేర్ ఇవ్వడం ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. వెనుక ఉన్న అసలైన హీరోలకు క్రెడిట్ ఇవ్వాలనే ఈ ప్రయత్నం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

విదేశాల్లో ఉన్నవారికి ఒక చిన్న విన్నపం
సినిమా నేపథ్యం గురించి చెబుతూ రామ్ చక్రి ఒక భావోద్వేగ సందేశాన్ని ఇచ్చారు. చాలామంది కుటుంబ పెద్దలు విదేశాల్లో సంపాదిస్తున్నారు, కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. డబ్బు ఎంత ముఖ్యమో, కుటుంబంతో గడిపే సమయం కూడా అంతే ముఖ్యం. ఏటా కనీసం ఒక్కసారైనా ఇంటికి వచ్చి కుటుంబంతో గడపాలని ఈ సినిమా ద్వారా కోరుకుంటున్నాను అని తెలిపారు. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి యువరాజ్ దక్షణ్ సినిమాటోగ్రఫీ, జగన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కాబోతున్న 'కార్మేని సెల్వం' ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+