విమానంలో నటికి చేదు అనుభవం.. ప్రయాణీకుడి వికృత చేష్టలు! (వీడియో)
విమాన ప్రయాణాల్లో కొందరు ప్రయాణీకులు చేసే విచిత్రమైన, అసభ్యకరమైన పనులు తోటి ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంటాయి. తాజాగా నటి, కంటెంట్ క్రియేటర్ ఊర్వి కొఠారికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. విమానంలో తన వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకుడి ప్రవర్తన వల్ల తాను ఎంతగానో అసౌకర్యానికి గురయ్యారని, ఆ క్షణంలో ఎంతో భయం వేసిందని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఏప్రిల్ 1న ఆమె షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
హద్దులు దాటిన ప్రయాణీకుడి ప్రవర్తన
నటి ఊర్వి కొఠారి షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఆమె విమానంలో తన సీటులో కూర్చుని ఉండగా వెనుక ఉన్న వ్యక్తి తన చేతులను ఊర్వి కూర్చున్న సీటుపైకి పదేపదే మారుస్తూ ఇబ్బంది పెట్టాడు. దీనిపై ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి ఆ ప్రయాణీకుడిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ ప్రయాణీకుడి తీరు మారలేదు. కాసేపటి తర్వాత ఆ వ్యక్తి తన కాళ్లను ఊర్వి కూర్చున్న సీటు ఆర్మ్ రెస్ట్ పైకి చాచాడుయ దీంతో చేసేదేమీ లేక ఆమె తన సీటును మార్చుకోవాల్సి వచ్చింది.

నెట్టింట వీడియో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
ఈ ఘటనపై ఊర్వి కొఠారి స్పందిస్తూ.. "నేను క్యాబిన్ క్రూకి చెప్పాను, వారు అతడిని హెచ్చరించారు. కానీ ఆ వ్యక్తి వేళ్లతో సీటును పట్టుకుంటూ నన్ను తాకడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏకంగా కాళ్లను నా సీటు మీదకు పెట్టాడు. నేను సగం సీటులోనే కూర్చోవాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, అందుకే సీటు మార్చుకున్నాను" అని ఊర్వి కొఠారి వివరించారు. ఈ వీడియో ఇప్పటికే 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సిందని.. మరికొందరు అలాంటి వారిని చితకబాదాలని కామెంట్ల వర్షం కురిపించారు.
నటికి మద్దతు పలికిన నెటిజన్లు
చాలా మంది నెటిజన్లు ఊర్వి కొఠారికి మద్దతుగా నిలిచారు. "ఇలాంటి వికృత చేష్టలు చేసేవారిని కఠినంగా శిక్షించాలి", "ధైర్యంగా స్పందించినందుకు గర్వంగా ఉంది" అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఊర్వి కొఠారిని విమర్శిస్తూ.. "వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే బదులు, అక్కడే గట్టిగా నిలదీయవచ్చు కదా?", "కేవలం ఫేమ్ కోసమే ఇలాంటి వీడియోలు పెడుతున్నారు" అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా, విమానాల్లో ప్రయాణికుల భద్రత, మర్యాదపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
-
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
ఈ చెట్లు మధ్యలో దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత











Click it and Unblock the Notifications