నందమూరి బాలకృష్ణకు కాల్ చేస్తే అలా అంటారనుకోలేదు - యంగ్ బ్యూటీ !!
నందమూరి బాలకృష్ణ.. స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన "అఖండ 2" చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. "అఖండ" మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో.. సంయుక్త హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా టాలీవుడ్‌లో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, యువ నటీనటుల్లో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు.

శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్..
ఇటీవల 'నారీ నారీ నడుమ మురారి' సినిమా విజయోత్సవ సమావేశంలో యువ హీరో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. తన సినిమా విజయం వెనుక బాలకృష్ణ (nandamuri Balakrishna ) ఆశీస్సులే కారణమని చెప్పిన శర్వా, ఇకపై తన ప్రతి సినిమా ప్రారంభోత్సవం బాలయ్య చేతుల మీదుగానే జరగాలని కోరుకుంటున్నట్లు భావోద్వేగంగా వెల్లడించారు. ఇప్పుడు అదే కోవలోకి ఒక యువ నాయిక కూడా చేరింది.
ఆమె ఎవరో కాదు... తమిళ సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దివ్యభారతి. 'బ్యాచిలర్' సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ, ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోషూట్స్‌తో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే దివ్యభారతి, త్వరలోనే తెలుగులోనూ అడుగుపెట్టబోతోంది. డిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న 'GOAT' సినిమాతో దివ్యభారతి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా బాలకృష్ణపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.
బాలయ్య అంటే నాకు చాలా ఇష్టం..
ఇంటర్వ్యూలో దివ్యభారతి మాట్లాడుతూ... బాలయ్య (nandamuri Balakrishna ) అంటే చాలా ఇష్టమని.. ఆయనలో ఒక పవర్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుందని.. చాలా యూనిక్ స్టైల్ స్పెషల్ అని తెలిపారు. అంతే కాకుండా సమరసింహారెడ్డి సినిమా చాలా ఫేవరెట్ అని వివరించింది. మరీ ముఖ్యంగా "GOAT" మూవీ షూటింగ్ సమయంలో బాలయ్యతో సన్నిహితంగా ఉండే ఓ నటుడు.. ఫోన్ నంబర్ ఇచ్చాడని వెల్లడించింది.

మొదట అది ప్రాంక్ కాల్ అనుకున్నాననని.. ఫోన్‌లో నిజంగానే బాలకృష్ణ (nandamuri Balakrishna ) తమిళంలో మాట్లాడారని వివరించింది. చాలా స్వీట్‌గా, ఆత్మీయంగా మాట్లాడారని.. తెలుగులో నీకు ఇది ఫస్ట్ మూవీ కదా... ఆల్ ది బెస్ట్, బాగా చేయండి అని చెప్పారని ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా చెన్నై గురించి, తన బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా అడిగారని చెప్పింది. కానీ ఫోన్‌లో మాట్లాడిన అనుభూతి మాత్రం చాలా స్పెషల్ అని.. అంత పెద్ద స్టార్ అలా ఉంటారని అనుకోలేదని తెలిపింది. దీంతో దివ్యభారతి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..?












Click it and Unblock the Notifications