నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ

సౌమ్య రావు.. బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటకలోని షిమోగాలో జన్మించిన ఈమె.. 2018లో టెలివిజన్ రంగంలో తమిళ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. రోజా సీరియల్ తో ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే తెలుగులో కూడా 'శ్రీమంతుడు' సీరియల్ లో నటించి మెప్పించింది. అయితే ఈ భామకు బ్రేక్ మాత్రం జబర్థస్త్ షో ద్వారానే దక్కిందని చెప్పాలి.

జబర్దస్త్‌లో తక్కువ కాలమే యాంకర్ గా పని చేసినా.. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. తన అందం, యాంకరింగ్ స్టైల్ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా హైపర్ ఆదితో కలిసి ఆమె వేసిన కౌంటర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ సంచలనంగా మారాయి.

anchor-soumya-rao-shocking-comments-about-her-drinking-habit-goes-viral-on-social-media

ఆమె ఏమన్నారంటే..

గతంలో యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న "కిస్సిక్ టాక్" షోలో సౌమ్య రావు పాల్గొన్నారు. షోలో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యారు. ఈ మేరకు 'పార్టీల్లో ఏమైనా తాగుతారా?' అనే సౌమ్యను ప్రశ్నించారు. అందుకు గాను ఆమె బదులిస్తూ.. అప్పుడప్పుడు వైన్ తాగుతాను అని చెప్పుకొచ్చారు. మైండ్ ఫ్రెష్‌గా ఉండడానికి ఒకటి లేదా రెండు పెగ్స్ తాగుతానని వెల్లడించారు. అందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదని.. తానేం పతివ్రతను కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫేక్‌గా చెప్పడం ఎందుకు అంటూ తెలిపారు. కానీ డ్రింకింగ్ అలవాటుగా మారకూడదని.. లిమిట్‌లో ఉంటేనే బాగుంటుందని అన్నారు.

అంతే కాకుండా డ్రింక్ చేసిన తర్వాత ఇండస్ట్రీ గురించే ఎక్కువగా ఆలోచిస్తానని ఓపెన్ అయ్యింది. తనని ఎవరు ఎలా ట్రీట్ చేశారు.. ఎవరు అవకాశాలు ఇవ్వలేదు.. ఎవరు డైలాగ్స్ కట్ చేశారు వంటి విషయాలు గుర్తుకొస్తాయని వివరించారు. ఇక తన ఫ్రెండ్స్ కూడా ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే మాట్లాడుతావ్ అంటూ అంటుంటారని తెలిపింది. అందుకే తనతో పార్టీకి రావడానికే భయపడతారు అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. గతంలో ఈ కామెంట్స్ వైరల్ అవ్వగా.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+