'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాక్ బస్టర్ డైరెక్ట్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మూవీ 'పెద్ది. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ మూవీపై అటు మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పెద్ది మూవీతో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని రామ్ చరణ్ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఈ మూవీ జూన్ 26 కు వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ మూవీని జూన్ 26 కు వాయిదా వేసినట్లు సమాచారం. అయితే "చెన్నై లవ్ స్టోరీ" మూవీని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ SKN చేసిన వ్యాఖ్యలతో ఈ వార్తకు బలం చేకూరింది. 'మా సినిమాను జూన్ 26న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ఆ తేదీన 'పెద్ది' మూవీ రిలీజ్ కాబోతోంది' అని ఆయన తెలిపారు. అయితే SKN వ్యాఖ్యలతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RamCharan Peddi Release Postponed from April 30 to June 26 Peddi release date change Peddi update

మరోవైపు పెద్ది మూవీని దర్శకుడు బుచ్చిబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. అయితే సినిమాలోని కొన్ని కీలక సీన్స్ చిత్రీకరించాల్సి ఉందట. ముఖ్యంగా రామ్ చరణ్ పై చిత్రీకరించాల్సిన ఒక స్పెషల్ సాంగ్.. మరికొన్ని పోర్షన్ లు షూటింగ్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం అందుతోంది. అందువల్ల ఏప్రిల్ 30 నాటికి సినిమా పూర్తి కావడం కష్టమని తెలుస్తోంది. ఈ కారణంతోనే మూవీని జూన్ చివరినాటికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై పెద్ది టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+