YEAR ENDER 2025: వెండితెరపై కొత్త అందాలు, మనసును హత్తుకునే పాత్రలతో నచ్చేశారు
తెలుగు చిత్ర సీమ ఈ ఏడాది కొత్త అందాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఎంత మంది వచ్చి పోయినా.. ఎంత రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేసినా.. సౌందర్యలా ఎప్పుడు గుర్తుండిపోయే పాత్రలు చేసి "చాలా బాగా చేసింది కదా!" అనిపించుకునే వారు చాలా అరుదు. అయితే ఈ ఏడాది ఈ కోవలో కొందరు నిలిచారు. మెప్పించారు, ఆకట్టుకున్నారు. చిన్న పాత్రలే కానీ వీళ్లు లేకపోతే సినిమానే లేదనే స్థాయిలో ఆ క్యారెక్టర్లకు ప్రాణం పోసిన ముద్దు గుమ్మలు, ముచ్చటైన భామల గురించి తెలుసుకుందాం.
8 వసంతాల శుద్ధి అయోధ్య..
ఎలాంటి అంచనాలు లేకుండా.. ఉమెన్ ఓరియంటెడ్ గా వచ్చిన చాలా చిన్న సినిమా.. 8 వసంతాలు. శుద్ధి అయోధ్యగా అనంతిక ప్రేక్షకులను ఏడిపించేసింది. గురువు కోసం, ప్రేమ కోసం, విద్య కోసం, స్నేహం కోసం ఇలా తనతో ప్రయాణం చేసే అన్ని పాత్రల్ని ప్రభావితం చేసింది. ఈ పిల్ల ఎంతలా మనల్ని ఆకట్టుకుందటే శుద్ది లాంటి అమ్మాయి మన జీవితంలో ఉంటే బాగుండు అని అందరూ ఫీల్ అయ్యేలా చేసింది. ఈ చిత్రంలో ఈ మలయాళీ కుట్టి చెప్పిన ప్రతి డైలాగ్ వైరల్ అయింది. క్లాసికల్ డాన్సర్, కరాటే లో బ్లాక్ బెల్ట్, సహజ సిద్ధమైన నటన.. వీటన్నింటి మేళవింపే శుద్ధి అయోధ్య. ఈ సినిమాలోని ప్రతి పాట కూడా చాలా ప్రత్యేకంగా నిలిచింది.

'కాత్యాయనీ భోంచేశావా?'
లిటిల్ హార్ట్స్... సినిమాతో అందరితో నవ్వులు పూయించింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం చెప్పే ప్రయత్నం చేసింది శివాని నాగారం. ఈ ఏడాది ఇన్ స్టాగ్రామ్ లో వైరలైన రీల్స్ కాత్యాయనీ భోంచేశావా? ఒకటి. ఇలా ఈ ఏడాది శివాని రెండు సూపర్ హిట్లు అందుకుంది. చిన్న కథతో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. శివానికి మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టాయి.
ఈ సుందరికి సంగీతమన్నా డాన్స్ అన్నా తనకు మహా ఇషం. తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో తన ఇష్టాలన్నీ బయటపెట్టేస్తుంది కూడా. ఇన్ స్టా లో వచ్చిన యాడ్ తన ఫ్రెండ్ షేర్ చేస్తే.. చూసి హీరోయిన్ ఆడిషన్ ఇచ్చింది. అంతే ఈ పిల్ల ట్యాలెంట్ చూసి సింగిల్ టేక్ లో ఛాన్స్ ఇచ్చేశారు సెలక్టర్స్. షార్ట్ ఫిల్మ్ లు, వెబ్‌సిరీస్‌లతో మొదలైన ప్రయాణం అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చింది ఈ హెదరాబాదీ అమ్మాయికి. ఈ క్రమంలోనే ఈ 2025 అదిరిపోయే హిట్స్ ఇచ్చి, చాలా మందికి క్రష్ గా కూడా మారిపోయింది.
షేక్ చేసిన బేబీ రితికా నాయక్
ఈ ఏడాది ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ను షేక్ చేసిన ట్యూన్ 'వైబ్ ఉంది బేబీ'. యూత్ మొత్తాన్ని వైబ్ చేసి తనకి ఫ్యాన్స్ అయ్యేలా చేసిది రితికా నాయక్. 'మిరాయ్' సినిమాలో సన్యాసిని సింపుల్ క్యారెక్టర్ చేసి మెప్పించిది. దేశ రాజధాన డిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దు గుమ్మకు 2025 సంవత్సరంలో తెలుగు తెరమీద మంచి మార్కులే పడ్డాయి. మిరాయ్ కంటే ముందు 'అశోకవనంలో అర్జున కల్యాణం', 'హాయ్ నాన్న'లలో తనవి చిన్న చిన్న రోల్స్ చేసింది. అయితే చిన్న రోల్స్ లో పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే ఈ సెప్టెంబర్ తన లైఫ్ ను టర్న్ చేసింది. 'మిరాయ్'లో సినిమాలో వచ్చిన హీరోయిన్ ఛాన్స్ ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది.
జాబిల్లి దాచిన అందం కోర్టులో నిలబడితే
ఈ ఏడాదిలో వచ్చిన కోర్ట్ సినిమా మనందరిని చాలా ఆలోచింపజేసింది. టీనేజ్ లవ్ యాంగిల్ ఒక ఎత్తు.. పోక్సో చట్ట దుర్వినియోగం మరో వైపు. ఈ రెండు కరెంట్ టాపిక్స్ ను సిల్వర్ స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు దర్శకుడు. ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అచ్చమైన తెలుగందం శ్రీదేవి. టీనేజ్ లో ఉండే మన పక్కింటి అమ్మాయిలా.. అమాయకమైన చూపులతో అందరిని షేక్ చేసింది. ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ క్రేజ్‌తో తెలుగుతోపాటు తమిళంలోనూ వరస అవకాశాలు అందిపుచ్చుకుంది. కాకినాడలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి జాబిల్లి పాత్రలో పండు వెన్నెల మాదిరి చల్లగా అందంగా ఆస్వాదించేలా చేసింది. పోక్సో లాంటి చట్టాలను తెరపై చూపి విమర్శకులతో సైతం ప్రశంసలూ అందుకునేలా చేసింది.
తండ్రి డైరెక్టర్.. కుమార్తె యాక్టర్
ఈ ఏడాదిలో వచ్చిన భైరవం సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఫేమన్ డెరెక్టర్ కూతురు అదితీ శంకర్. పక్కా పల్లెటూరి పిల్లలా, లంగావోణీలో చక్కగా తన ప్రాత్రకు ప్రాణం పోసింది. ఈ సినిమాలో 'వెన్నెలా.. నీ మాయలా' పాట వైరలైన సంగతి మనందరికి తెలిసిందే. చైల్డ్ హుడ్ నుంచే సినిమాల్లోకి రావాలని ఇంట్రస్ట్ ఉన్నప్పటికి.. ఎంబీబీఎస్ అయ్యాకే మనసులో మాటను బయటపెట్టేసింది. కుతూరు కోరికను తండ్రి కూడా కాదనలేకపోయారు. అంతే ఇంక వెండి తెరపై తన ట్యాలెంట్ తో మంచి పేరు తెచ్చుకుంది .
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications