తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!

తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు దృష్టిసారించాయి. ఇందులో విజేతలను బట్టి ఓటర్ల మూడ్ ఎలా ఉందన్నది మరోసారి వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు (survey)ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆత్మసాక్షి సంస్థ కూడా తమ సర్వే ఫలితాలను వెల్లడించింది.

తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోంలో ఓటర్ల అభిప్రాయంపై ఆత్మసాక్షి నిర్వహంచిన సర్వే ఫలితాలు ప్రకటించారు.ఇందులో తమిళనాడులోని 234 స్థానాల్లో డీఎంకే కూటమికి 119-125 స్ధానాలు, అన్నాడీఎంకే కూటమికి 108-117 సీట్లు, విజయ్ పార్టీ టీవీకేకు 5-9 స్ధానాలు దక్కవచ్చని తేలింది. ఇతరులకు 1-3 సీట్లు లభించే అవకాశం ఉంది. అలాగే పశ్చిమబెంగాల్లోని 294 సీట్లలో అధికార తృణమూల్ కాంగ్రెస్కు 178-198 సీట్లు లభించనున్నాయి. బీజేపీ కేవలం 100-110 సీట్లతో సరిపెట్టుకోనుంది. అలాగే ఇతరులకు 2-6 సీట్లు దక్కే అవకాశముందని తేలింది.

Aatma Sakshi Assembly Poll Survey Tamil Nadu West Bengal Assam Kerala Forecasts

కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 140 సీట్లలో అధికార ఎల్డీఎఫ్ కు 69-73 సీట్లు దక్కే అవకాశం ఉంది. అయితే విపక్ష యూడీఎఫ్ సైతం 67-72 సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని తేలింది. బీజేపీకి మాత్రం 3-4 సీట్లు దక్కనున్నట్లు ఆత్మసాక్షి సర్వే తెలిపింది. అలాగే అస్సాంలో ఎన్నికలు జరిగే 126 సీట్లకు గానూ అధికార బీజేపీకి 76-81 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది.
కాంగ్రెస్ కు 45-50 సీట్లు లభించవచ్చని తెలిపింది. ఇతరులకు 5-9 సీట్లు లభిస్తాయని సర్వే అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+