తమిళనాడులో డీఎంకే పార్టీకి మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం..?
మాజీ మంత్రి, వైసీపీ కీలకనేత ఆర్కే రోజా మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. గత వైసీపీ హయాంలో మంత్రిగా చేసినా.. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా కానీ ఎప్పుడు తనదైన శైలిలో రాజకీయంగా యాక్టివ్ గానే ఉంటుంటారు. అయితే రాజకీయాల్లోకి రాకముందు నటిగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందిన ఆమె.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు పొలిటికల్ గా కూడా రోజా వ్యవహారం తమిళనాడు పాలిటిక్స్ లో కూడా చర్చకు రావడం సంచలనంగా మారింది.
( roja ) అసలేం జరిగిందంటే..
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్నో అద్బుతమైన సంక్షేమ పథకాలు స్టాలిన్ అందిస్తున్నారు.. ప్రతి నెలా వెయ్యి రూపాయల మహిళలకు నేరుగా అకౌంట్ లో వేయడం గొప్ప పథకం అని చెప్పారు. అలానే ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా మహిళలకు డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి రెండేళ్లు అయినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.

దీంతో త్వరలోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే పార్టీ తరపున రోజా ప్రచారం చేయనున్నారా అని జోరుగా చర్చ నడుస్తోంది. అంతే కాకుండా గతంలో సనాతన ధర్మం వ్యవహారంలో కూడా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే. ఇద్దరు నేతల మధ్య ఇన్ డైరెక్ట్ గానే ట్వీట్ వార్ నడిచింది. దాంతో రోజా డీఎంకేకి రోజా మద్దతు ఇవ్వడం.. ప్రచారం చేయడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ వ్యవహారంపై రోజా స్పందించారు. తాను కేవలం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసమే వెళ్లినట్టు స్పష్టం చేశారు. మంత్రి చంద్రశేఖర్ తనకు అత్యంత ఆప్తులని, కుటుంబ సభ్యుడు లాంటి వారని చెప్పుకొచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు మాత్రమే వెళ్లానని.. అక్కడ రాజకీయాలకు తావు లేదన్నారు. తాను ఎటువంటి ప్రచారంలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications