వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత:ఆమెకు 82 ఏళ్ళు, అతనికి 28 ఏళ్ళు, ఇద్దరిని కలిపింది ఫోన్

82 ఏళ్ళ బామ్మను 28 ఏళ్ళ యువకుడు ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. ఓ రాంగ్ ఫోన్ కాల్ ఈ జంటను కలిపింది. అయితే ఈ జంట 28 ఏళ్ళ యువకుడు సోఫియన్ మాత్రం బామ్మను పట్టుబట్టి పెళ్ళి చేసుకొన్నాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జకార్తా:ప్రేమ గుడ్డిది, ప్రేమకు కులం, మతం పట్టింపులు ఉండవి చెబుతుంటారు. ప్రేమలో పీకలతోతు మునిగిపోయిన వారు తరచూ ఇవే మాటలను చెబుతుంటారు. ఈ మాటలను వినే వారు సరదాగా తీసుకొంటుంటారు.కాని, నిజంగానే ప్రేమ గుడ్డిది వయస్సు, కులం, మతం లాంటి వాటిని పెద్దగా పట్టించుకోదని ఓ ఘటన తేటతెల్లం చేసింది. 82 ఏళ్ళ బామ్మను 28 ఏళ్ళ యువకుడు ప్రేమించి మరీ వివాహం చేసుకొన్నాడు.

ప్రేమను గెలిపించుకొనేందుకుగాను అనేక త్యాగాలను చేస్తుంటారు ప్రేమికులు. ఈ తరహ ఘటనలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కాని, తమ ప్రేమ కోసం సాహాసాలు చేయడం అసాధారణ నిర్ణయాలను తీసుకోవడం కూడ జరుగుతుంటాయి.

ప్రేమలో పడితే కాని ప్రేమికులు ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తారో అర్థం కాదని చెబుతుంటారు. ప్రేమ కథ ఆధారంగా తీసిన సినిమాలు అందుకే హిట్ అవుతుంటాయి.

ఎవరు ఎవరికి ఏ క్షణాన నచ్చుతారో ఎందుకు నచ్చుతారనే విషయమై ఎవరికీ అంతుబట్టదు.అయితే వారిద్దరి మధ్య మనసులు కలిస్తే మాత్రం ఎటువంటి ఇబ్బందులకు తావుండదు.

82 ఏళ్ళ బామ్మను ప్రేమించి పెళ్ళి చేసుకొన్న 28 ఏళ్ళ యువకుడు

82 ఏళ్ళ బామ్మను ప్రేమించి పెళ్ళి చేసుకొన్న 28 ఏళ్ళ యువకుడు

28 ఏళ్ళ యువకుడు ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. అయితే ఆయన తన సమానమైన వయస్సున్న యువతిని ప్రేమించలేదు.తన కంటే సుమారు 54 ఏళ్ళ వయస్పు పెద్దదైన వృద్దురాలిని ప్రేమించి మరీ వివాహం చేసుకొన్నాడు,. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకొంది. వినడానికే ఇది ఆశ్చర్యంగా అనిపిస్తోంది కాని, ఇది నిజం . ఈ జంట గురించి తెలుసుకొనేందుకుగాను ప్రపం

ఇద్దరిని కలిపిన ఫోన్

ఇద్దరిని కలిపిన ఫోన్

కాల్ఇండోనేషియాలో 82 ఏళ్ళ బామ్మను 28 ఏళ్ళ యువకుడు ప్రేమించి వివాహం చేసుకోవడానికి కారణంగా ఓ ఫోన్ కాల్.ఫోన్ కాలే వీరిద్దరి మద్య అనుబంధానికి కారణమైంది.వీరిద్దరి మద్య వయస్సులో తేడా ఉన్న పట్టుబట్టి ఈ జంట వివాహం చేసుకొంది. ఈ జంటను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

రాంగ్ కాల్ జీవిత భాగస్వామిని కలిపింది

రాంగ్ కాల్ జీవిత భాగస్వామిని కలిపింది

మాంటెహేగ్ కు చెందిన సోఫియన్ లోహెడాండెల్ అనే 28 ఏళ్ళ యువకుడికి ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. అయితే అతనితో ఓ మహిళ మాట్లాడింది.ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె పొరపాటున ఫోన్ చేసిందని హెడాండెల్ తెలుసుకొన్నాడు. అయితే పొరపాటున ఫోన్ చేసినా వారిద్దరి మధ్య పరిచయానికి కారణమైంది.దీంతో తరచూ ఫోన్ లో మాట్లాడుకొనేవారు.

అమ్మాయిని చూడకుండానే ప్రేమలో పడిన యువకుడు

అమ్మాయిని చూడకుండానే ప్రేమలో పడిన యువకుడు

సోఫియన్ తరచూ ఆ మహిళతో ఫోన్ లో మాట్లాడేవాడు.దీంతో ఆమె మాట్లాడుతున్న తీరు ఆమె వ్యక్తిత్వాన్ని తెలుసుకొని ఆమె పట్ల ప్రేమను పెంచుకొన్నాడు. ఇద్దరూ కూడ ఒకరినొకరు తెలుసుకొన్నారు. అయితే తన ప్రేయసి వయస్సు గురించి మాత్రం ఆయన ఆరా తీయలేదు.అయితే ఇద్దరి అభిప్రాయాలు దాదాపుగా కలిసిపోయాయి.

ప్రేయసిని చూసేందుకు 120 కిలోమీటర్ల ప్రయాణించిన ప్రియుడు

ప్రేయసిని చూసేందుకు 120 కిలోమీటర్ల ప్రయాణించిన ప్రియుడు

రాంగ్ ఫోన్ కాల్ ఇద్దరి మధ్య ప్రేమను చిగురింపజేసింది.అయితే ఈ ప్రేమ కారణంగా ఇద్దరు తరచూ ఫోన్ లో మాట్లాడుకొనేవారు. చివరకు తన ప్రేయసిని కలుసుకొనేందుకుగాను సోఫియన్ 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ మినహాసాలోని లీలెమా అనే గ్రామంలో ఉన్న ప్రేయసి దగ్గరికి వెళ్ళాడు.అయితే తాను ఇంత కాలం పాటు ఫోన్ లో మాట్లాడిన మహిళను చూసిన సోఫియన్ షాకయ్యాడు. ఇంతకాలం పాటు తాను మాట్లాడింది 82 ఏళ్ళ వృద్దురాలని తెలుసుకొన్నాడు.అయితే తాను నిజంగానే ఆమెను ప్రేమిస్తున్నాని మార్తా పోటు కుటుంబసభ్యులకు చెప్పాడు సోఫియన్.

సోఫియన్ కుటుంబ సభ్యులకు షాక్

సోఫియన్ కుటుంబ సభ్యులకు షాక్

తాను ఓ అమ్మాయిని ప్రేమించానని ఆమెనే వివాహం చేసుకొంటానని సోఫియన్ తన కుటుంబసభ్యులకు చెప్పాడు.అయితే అమ్మాయిని చూసేందుకు కుటుంబసభ్యులను తీసుకెళ్ళాడు సోఫియన్. అప్పటివరకు కుటుంబసభ్యులకు కూడ తాను ప్రేమించిన అమ్మాయి వయస్సు ఎంతో అతను చెప్పలేదు. మార్తా పోటును చూసిన సోఫియన్ కుటుంబసభ్యులు షాకయ్యారు. అయితే కుటుంబసభ్యులను ఒప్పించి సోఫియన్ మార్తాపోటును వివాహం చేసుకొన్నాడు.

 వృద్దాప్యంలో తోడు దొరికింది

వృద్దాప్యంలో తోడు దొరికింది

మార్తా పోటు, సోఫియన్ ల వివాహం గత నెల 18వ, తేదిన జరిగింది. మార్తా పోటు భర్త పదేళ్ళ క్రితం అనారోగ్యంతో మరణించాడు.అయితే సోఫియన్ రూపంలో ఆమెకు తోడు దొరికింది. వృద్దాప్యంలో తనకు తోడు కావాలని కోరుకొన్నానని సోఫియన్ తనకు జీవితాంతం తోడుగా ఉంటాడని మార్తాపోటు చెప్పింది.అయితే ఈ జంట వివాహన్ని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారు. మార్తా పోటు పిల్లలు జర్మనీ, సౌదీ అరేబియాలో స్థిరపడ్డారు.

English summary
They say love knows no boundaries, and the touching story of how a 28-year-old man in Indonesia fell in love with a woman 54 years his senior over the phone and ended up marrying her despite objections from both their families seems to confirm the old saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X