US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, పర్యాటకులు, ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా అపాయింట్‌మెంట్ల విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. 2027 వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, తాజాగా 1 నుంచి 3 నెలల వ్యవధిలోనే స్లాట్లు అందుబాటులోకి వస్తున్నట్లు గ్లోబల్ వీసా స్టేటస్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ వెసులుబాటును వినియోగించుకునే క్రమంలో హెచ్-1బీ వీసాదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు.

గత డిసెంబర్ (2025)లో సెలవులకు స్వదేశానికి వచ్చిన వేలాది మంది భారతీయులు ఇప్పటికీ ఇక్కడే చిక్కుకుపోయారు. కాన్సులేట్లు అకస్మాత్తుగా ఇంటర్వ్యూలను రద్దు చేసి, వాటిని మే లేదా జూన్ 2026కి రీషెడ్యూల్ చేయడమే దీనికి ప్రధాన కారణం. స్టాంపింగ్ లేకపోతే తిరిగి అమెరికాలో ప్రవేశించే అవకాశం ఉండదు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఇండియాకు అనుమతినిచ్చినా, మరికొన్ని ఉద్యోగాల విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు స్లాట్లు అందుబాటులోకి వచ్చినా, అవి ఎప్పుడు రద్దు అవుతాయో లేదా రీషెడ్యూల్ అవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది.

US Visa Slots Open in India Experts Warn Against International Travel Despite Shorter Waiting Times

ప్రయాణం ఎందుకు ప్రమాదం?

ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ అభిప్రాయం ప్రకారం.. అమెరికాలో ఉండి ఇప్పటికే ఐ-797 (I-797) అప్రూవల్ ఉన్నవారికి తక్షణమే వీసా స్టాంపింగ్ అవసరం లేదు. కేవలం దేశం వెలుపలికి వెళ్లినప్పుడు మాత్రమే ఈ స్టాంపింగ్ అవసరమవుతుంది. "స్లాట్ బుక్ చేసుకోవడం సులభమే కావొచ్చు, కానీ విదేశాల్లో ఉన్నప్పుడు వీసా ప్రక్రియలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే లేదా అపాయింట్‌మెంట్ రద్దు అయితే మీరు అమెరికా వెళ్లలేరు" అని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వలసదారుల ప్రవేశాన్ని కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ నేపథ్యంలో అనవసర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచించారు.

స్లాట్ల తాజా పరిస్థితి ఏంటి?

హెచ్-1బీ & హెచ్-4 (ఉద్యోగ & డిపెండెంట్): గతంలో 2027 వరకు వేచి చూడాల్సి రాగా, ప్రస్తుతం 30 నుంచి 90 రోజుల వ్యవధిలోనే స్లాట్లు దొరుకుతున్నాయి. నవంబర్ వరకు ఉన్న ఖాళీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

బీ1, బీ2 (పర్యాటక వీసా): వీటి వెయిటింగ్ సమయం మాత్రం ఇంకా ఎక్కువగా ఉంది. కొన్ని నగరాల్లో 3 నుంచి 9 నెలల సమయం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో 8 నెలల టైం పడుతుంది.

ముహూర్తాలపై ప్రభావం: అపాయింట్‌మెంట్లు దొరక్కపోవడంతో అమెరికాలో ఉంటున్న వివాహ వయస్కులు భారత్‌కు రాలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చినా డిపెండెంట్ వీసాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి రావడంతో చాలా మంది వివాహాలు వాయిదా పడ్డాయి.

మర్చిపోవద్దు: స్టాంపింగ్ అంటే కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే!

హెచ్-1బీ వీసా అనేది కేవలం పాస్‌పోర్ట్‌పై ఉండే ఒక స్టిక్కర్. ఇది అమెరికాలో ప్రవేశించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీ ఐ-797 ఫారం చెల్లుబాటులో ఉన్నంత వరకు, అమెరికాలో స్టాంపింగ్ గడువు ముగిసినా మీరు చట్టబద్ధంగా పని చేసుకోవచ్చు. కాబట్టి ప్రయాణం చేయాల్సిన అవసరం లేనప్పుడు కేవలం స్టాంపింగ్ కోసం ఇండియాకు రావడం ప్రస్తుతం రిస్క్ తో కూడుకున్న పని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+