ఇక టార్గెట్ ‘సూర్యుడే’! నాసా వ్యోమనౌక వచ్చే ఏడాదే !!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ వచ్చే ఏడాది తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనకు ఓ వ్యోమనౌకను పంపించనుంది.
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనకు ఓ వ్యోమనౌకను పంపించనుంది. 'సోలార్ ప్రోబ్ ప్లస్ మిషన్' పేరిట చేపట్టనున్న ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాది నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా భగభగమండే సూర్యుడి ఉపరితలం నుంచి ఆరు మిలియన్ల కిలోమీటర్ల దూరానికి ఓ వ్యోమనౌకను పంపుతారు. 'సూర్యుడిపైకి వ్యోమనౌకను పంపుతున్న తొలి ప్రయోగం ఇదే. ఈ వ్యోమనౌక సూర్యుడి ఉపరితలం మీదికి వెళ్లదు. అయితే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం కనిపెట్టేంత చేరువకు చేరుకుంటుంది..' అని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిశోధకుడు ఎరిక్ క్రిస్టియన్ తెలిపారు.
ఒకటి - సూర్యుడి వాతావరణం (కరోనా-రెండు మిలియన్ల డిగ్రీలు) కంటే ఉపరితలం (ప్రోటోస్పియర్-5500 డిగ్రీలు)పై ఉష్ణోగ్రత ఎందుకు తక్కువగా ఉంటుంది?

రెండు-సౌర పవనాలు భారీ వేగాన్ని (గంటకు మిలియన్ మైళ్లు) ఎలా అందుకోగలుగుతున్నాయి?
మూడు- సూర్యుడి నుంచి అప్పుడప్పుడు ఎందుకు అత్యంత శక్తిమంతమైన రేణువులు వెలువడుతున్నాయి?
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు అన్వేషించేందుకే నాసా ఇప్పుడీ సూర్యుడి సమీపానికి వ్యోమనౌకను పంపే ప్రయోగానికి సిద్ధమైంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications