వాస్తు ప్రకారం ఇంట్లో 2 బీరువాలంటే.. ఏం చేయాలంటే..
వాస్తు ఇంటికే కాకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా వర్తిస్తుంది. ఏ వస్తువు ఏ దిక్కులో ఉండాలి? ఏ దిక్కులో ఉంటే కలిసివస్తుంది? లేదంటే నష్టాలు వస్తాయనే విషయాన్ని వాస్తు నిపుణులు చెబుతారు. అలాగే కొందరి ఇళ్ల్లో 2 బీరువాలుంటాయి. అయితే వాటిని ఎక్కడ పెట్టుకోవాలి? ఏ దిక్కులో ఉంచాలి? తదితర విషయాలు చాలామందికి తెలియదు. అయితే రెండు బీరువాలున్నప్పుడు ఎటువంటి నియమాలుండాలనే వివరాలను తెలుసుకుందాం.
బీరువా ఎప్పుడూ ఇంట్లో నైరుతి మూల ఉండాలి.
ఒక బీరువా ఉంటే బెడ్ రూం నైరుతి మూలలో పెట్టుకోండి.
ఇంకో బీరువా ఉంటే హాల్ లో పెట్టుకోవచ్చు.
లేదంటే మరో గదిలోనైనా పెట్టుకోవచ్చు.
ఎక్కడ పెట్టుకున్నా నైరుతి మూలలో ఉండాలి.
నైరుతి మూలలో స్థలం లేకపోతే మధ్య దక్షిణ, మధ్య పశ్చిమంలో పెట్టుకోవాలి.
అలా పెట్టినప్పుడే ఎటువంటి దోషాలు అంటవు.

డబ్బులు, నగలు పెట్టే బీరువా దక్షిణం గోడకు ఆనుకోవాలి.
ఈ బీరువా ఉత్తరంవైపు చూస్తున్నట్లుగా ఉండాలి.
రెండో బీరువాను సాధారణ వస్తువులకు వాడుతుంటే మాత్రం
వాయువ్యం లేదంటే దక్షిణం వైపు గోడలకు పెట్టుకోవాలి.
ఒకవేళ రెండో బీరువా కూడా బెడ్ రూంలోనే ఉంటే,
నైరుతి మూలలో ఉన్న బీరువా కంటే కొంచెం ఎత్తు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
గది తలుపులకు ఎదురుగా బీరువా పెడితే మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు.
ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు.
బీరువాను గోడకు పూర్తిగా ఆనివ్వకూడదు.
కనీసం రెండు నుంచి మూడు అంగుళాల స్థలం వదలాలి.
డబ్బులు దాచుకునే బీరువా తలుపుకు అద్దం ఉంటే ఎదురుగా ఉన్న మంచాన్ని చూపించకూడదు.
బెడ్ రూపంలో బీరువా అద్దం అనేది మంచంవైపు ఉండకూడదు.
నైరుతి మూలలో ఉండే ప్రధాన బీరువా కింద చిన్న పీట లేదా స్టాండ్ వేసి భూమికి కొంచెం ఎత్తులో ఉంచడం చాలా మంచిది.
బీరువా లోపల ఉత్తర దిశలో ఒక చిన్న అద్దాన్ని అమర్చడం వల్ల డబ్బు బాగా వస్తుందని నమ్మకం.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!












Click it and Unblock the Notifications