వాస్తు ప్రకారం బాత్‌రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి అణువుకు, ప్రతి మూలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు ప్రకారం వాటిని అనుసరిస్తుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇళ్ల్లో గొడవలు జరుగుతుంటాయి. మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది. దీనికి వాస్తు దోసం కూడా ఒక కారణం కావొచ్చు. అందుకే దీన్ని అధిగమించడానికి బాత్ రూం, టాయిలెట్ వంటి ప్రదేశాల్లో ఉప్పును ఉంచాలని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ రెండు ప్రదేశాల్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కళ్లుప్పు అనేది వీటికి ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని చెప్పొచ్చు.
బాత్ రూం ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంటుంది. తేమ, మురికి, బురద ఉంటాయి. అక్కడ ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఆ శక్తి గ్రహించి పారద్రోలుతుంది. దీనివల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఉప్పుకు చంద్రుడితో, రాహువుతో ప్రత్యేక అనుబంధం ఉంది. బాత్ రూంలో ఉండే రాహువు ప్రభావాన్ని ఉప్పు తగ్గిస్తుంది.

ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పును తీసుకోవాలి. బాత్ రూపంలో నీరు పడనిచోట ఒక మూలన పెట్టాలి.
ఏ గిన్నె పడితే ఆ గిన్నె కాకుండా గాజు గిన్నెనే వాడాలి. ప్రతి వారానికి ఒకసారి ఉప్పును మారుస్తుండాలి.
పాత ఉప్పును పారేయాలి. లేదంటే కాల్వలో కలపాలి.
దీని వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. మానసిక ప్రశాంతత నెలకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ఉప్పు తడిగా మారినట్లుగా కనపడితే అది ప్రతికూలశక్తిని గ్రహించిందని మనం అర్థం చేసుకోవాలి. గిన్నెను శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి.
మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసుకున్నా చాలు. దీనివల్ల శరీరంలోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. వాస్తు ప్రకారం ఈ అలవాటు చాలా మంచిది.
మనిషికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.












Click it and Unblock the Notifications