బయటపడుతున్న పోలీసు అకృత్యాలు-విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు..! ఎట్టకేలకు వేటు..!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా విద్యార్ధులు చేపట్టిన నిరసనలపై పోలీసుల అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. బీహార్ లో నిరసన చేస్తున్న విద్యార్దులపై ఓ పోలీసు కానిస్టేబుల్ ఏకంగా ఏకే-47 (AK-47)తో కాల్పులు జరిపిన ఘటన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయినా సదరు పోలీసు కానిస్టేబుల్ (Bihar police) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎట్టకేలకు అతనిపై వేటు వేశారు.
బీహార్ లోని సివాన్ జిల్లాలో జూలై 25న జరిగిన బీహార్ బంద్ నిరసనల సందర్భంగా, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఒక పోలీసు కానిస్టేబుల్ ఏకే-47 రైఫిల్‌ను ప్రయోగిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. రాష్ట్రవ్యాప్త బంద్ సందర్భంగా పలు జిల్లాల్లో విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ క్రమంలో పలుచోట్ల నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ సమయంలోనే సదరు పోలీసు కానిస్టేబుల్ ఏకే-47తో కాల్పులు జరుపుతున్నట్లుగా ఉన్న వైరల్ ఫుటేజ్‌ను బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ తీవ్రంగా పరిగణించి, సస్పెండ్ చేయాలని ఆదేశించింది.

New Achievement Unlocked for Narendra Modi.
— D (@Deb_livnletliv) July 26, 2026
Becomes the first PM whose govt allowed Police to use AK-47 rifles on Students protesting against paper leak and Education Minister.
Aakash & Aarif were shot in their neck/shoulder in Bihar.
So much for Mother of Democracy. pic.twitter.com/TwpsiAQDI9
రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా నగరంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి గాంధీ మైదాన్ వైపు కవాతు చేశారు. విద్యార్థులు నినాదాలు చేస్తుండగా, నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి విషమించింది. ఈ కాల్పుల్లో పాట్నాలోని జయప్రభ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు గాయపడిన నిరసనకారుల పరిస్థితి నిలకడగా ఉంది. శాంతిభద్రతలను కాపాడటమే తమ బలగాల ప్రాథమిక బాధ్యత అని, రూల్స్ ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర శాఖాపరమైన విచారణ ప్రారంభించామని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. తుపాకీ వాడకం పోలీసు నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా, ఇంకా ఏవైనా క్రమశిక్షణా లేదా చట్టపరమైన చర్యలు అవసరమా అనే విషయాలను ఈ దర్యాప్తులో తేల్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications